breaking news
Dambulla ODI
-
Ind Vs Pak: ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ జరుగబోయేది అక్కడే..!
ఆసియా కప్-2023ను (వన్డే ఫార్మాట్) ఈ ఏడాది హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 17 వరకు జరిగే ఈ టోర్నీకి పాకిస్తాన్, శ్రీలంక దేశాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ టోర్నీ ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరుగుతుందన్న వివరాలు వెల్లడి అయినప్పటికీ.. వేదికలు, ఫిక్షర్స్ ఇంకా ఖరారు కాలేదు. అయితే, ఈ టోర్నీలో భారత్-పాక్ గ్రూప్ దశ మ్యాచ్ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై మాత్రం ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు (ఏసీసీ) ఓ క్లారిటీ ఉన్నట్లు తెలుస్తోంది. అందరూ అనుకున్న విధంగా భారత్-పాక్ మ్యాచ్‌ను కొలొంబోలో కాకుండా డంబుల్లాలో నిర్వహించాలని ఏసీసీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఏసీసీ ఇదివరకే నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. లంకలో జరిగే మిగతా మ్యాచ్‌ల వేదికలు ఖరారయ్యాక, ఈ విషయాన్నిఅధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సీజన్లో కొలొంబోలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున భారత్-పాక్ మ్యాచ్ వెన్యూను డంబుల్లాకు మార్చాలని అనుకున్నట్లు ఏసీసీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు పాకిస్తాన్ లెగ్ మ్యాచ్‌లన్నీ లాహోర్‌లో జరుగుతాయని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇదివరకే ప్రకటించింది. కాగా, ఇదివరకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. పాకిస్తాన్లో 4 మ్యాచ్‌లు, శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి టైటిల్ కోసం పోటీపడతాయి. ఓ గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్, నేపాల్.. మరో గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లు ఉన్నాయి. -
టీమిండియా విక్టరీ.. చుక్కలు చూపిన ఫ్యాన్స్
కోలంబో: టీమిండియాతో జరుగుతున్న సిరీస్ లో ఆతిథ్య జట్టు శ్రీలంక పేలవమైన ప్రదర్శన ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానుల్లో తీవ్ర ఆగ్రహా జ్వాలలు పెల్లుబిక్కుతున్నాయి. డంబుల్లాలో మొదటి వన్డే ఓటమి తర్వాత ఏకంగా సభ్యులను ఘోరావ్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు 50 మంది క్రికెట్ ఫ్యాన్స్ ఆదివారం వన్డే ముగిశాక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సును అడ్డగించి వ్యతిరేక నినాదాలు చేశారని సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చే తీవ్రంగానే యత్నించినట్లు స్థానిక మీడియాలు వెల్లడించాయి. మరోవైపు జట్టులో అంతర్గత కలహాలపై కోచ్ నిక్ పోతస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్లు ఫిట్నెస్ పరంగా అద్భుతంగా రాణిస్తున్నారని, అయితే సమస్యలు డ్రెస్సింగ్ రూంలోనే పుడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో తనకు జట్టులో స్వేచ్ఛ ఇవ్వాలంటూ మీడియా సాక్షిగా ఆయన బోర్డుకు విజ్నప్తి చేయటం విశేషం. మరోపక్క జట్టుపై వస్తున్న విమర్శల నేపథ్యంలో మాజీ ఆటగాడు కుమార సంగక్కర స్పందించారు. ఇలాంటి సమయంలో సంయమనంతో ఉండి జట్టు సభ్యులకు మద్ధతుగా నిలవాలంటూ సంగక్కర ఓ వీడియో సందేశంలో పిలుపునిచ్చారు.