గైక్వాడ్‌ సెంచరీ.. ఉత్కంఠ పోరులో టీమిండియా గెలుపు | Ruturaj Gaikwad ton and late collapse hand India A opening honours | Sakshi
Sakshi News home page

గైక్వాడ్‌ సూపర్‌ సెంచరీ.. ఉత్కంఠ పోరులో టీమిండియా గెలుపు

Jun 9 2026 7:30 PM | Updated on Jun 9 2026 7:41 PM

Ruturaj Gaikwad ton and late collapse hand India A opening honours

శ్రీలంకలో జరుగుతున్న ఏ-జట్ల ముక్కోణపు టోర్నీలో టీమిండియా బోణీ కొట్టింది. డంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో ఇవాళ (జూన్‌ 9) జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌..  రుతురాజ్‌ గైక్వాడ్‌ (101) సూపర్‌ సెంచరీతో, కెప్టెన్‌ తిలక్‌ వర్మ (60) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓ‍వర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ ఆఖర్లో ఆయుశ్‌ బదోని (24), సూర్యాంశ్‌ షేడ్గే (26 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించారు. 

మిగతా ఆటగాళ్లలో ప్రియాంశ్‌ ఆర్మ 32, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ 2, అనుకూల్‌ రాయ్‌ 1 (నాటౌట్‌) పరుగు చేయగా.. ఐపీఎల్‌ 2026 తర్వాత భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన వైభవ్‌ సూర్యవంశీ 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.

లంక బౌలర్లలో మొహమ్మద్‌ షిరాజ్‌ 2 వికెట్లు తీయగా.. కరుణరత్నే, సంకేత్‌, వనుజ సహాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక, సాహన్ అరచ్చిగే (74), నిరోషన్ డిక్వెల్లా (47), సమరవిక్రమ (46) రాణించడంతో ఓ దశలో (262/6) గెలుపు దిశగా దూసుకెళ్లింది. అయితే చివరి రెండు ఓవర్లలో (7 పరుగుల వ్యవధిలో)  కేవలం 10 పరుగులు అవసరమైన సమయంలో శ్రీలంక వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి 269 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది.

అర్షద్ ఖాన్, ఆయుష్ బదోని, అనుకూల్‌ రాయ్‌, విప్రాజ్‌ నిగమ్‌ తలో రెండు వికెట్లు తీయగా, అన్షుల్‌ కంబోజ్ ఓ వికెట్‌ పడగొట్టింది. జూన్‌ 11న జరిగే తదుపరి మ్యాచ్‌లో భారత్‌-ఏ, ఆఫ్ఘనిస్తాన్‌-ఏ తలపడనున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement