అఖిలప్రియ అనుచరుల దాడి.. గాయపడిన నాగలక్ష్మి మృతి | Ahobilam Akhilapriya Followers Incident: Nagalakshmi Died | Sakshi
Sakshi News home page

అఖిలప్రియ అనుచరుల దాడి.. గాయపడిన నాగలక్ష్మి మృతి

Nov 28 2026 7:51 AM | Updated on Nov 28 2026 7:59 AM

Ahobilam Akhilapriya Followers Incident: Nagalakshmi Died

సాక్షి, నంద్యాల జిల్లా: అహోబిలంలో అఖిలప్రియ అనుచరుల దాడిలో గాయపడిన నాగలక్ష్మి మృతి చెందారు. రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగలక్ష్మి మృతిచెందింది. స్థానిక ఎన్నికల్లో టీడీపీ మూకలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. రిగ్గింగ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయగా నాగలక్ష్మిపై అఖిల ప్రియ అనుచరులు దాడి చేశారు. నిరసన తెలుపుతున్న నాగలక్ష్మిపై అఖిలప్రియ కాన్వాయ్‌ దూసుకెళ్లింది. మృతి చెందిన మహిళ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రా రెడ్డి పరామర్శించారు.

పోలింగ్ బూత్‌ల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను కట్టెలతో చితకబాదుతున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారన్నారని బిజేంద్రారెడ్డి మండిపడ్డారు. నాగలక్ష్మి మృతిపై తీవ్ర విచారణ చేసి నిందితులకు కఠిన శిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అహోబిలం అల్లర్లపై ఇప్పటివరకు పోలీసులు ఎఫ్ఐఆర్ చేయలేదని తీవ్ర స్థాయిలో పోలీసులపై గంగుల బిజేంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: కస్టోడియల్‌ టార్చర్‌ చేసి నన్ను చంపాలని చూశారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement