ప్రేమ పేరుతో వేధింపులు... చెప్పుతో విద్యార్థినిపై దాడి! | Student Attacked Over Love Rejection In School | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో వేధింపులు... చెప్పుతో విద్యార్థినిపై దాడి!

Nov 26 2026 11:22 AM | Updated on Nov 26 2026 11:22 AM

Student Attacked Over Love Rejection In School

నల్గొండ, మునగాల: ప్రేమను నిరాకరించిందనే కక్షతో గిరిజన విద్యార్థినిపై తోటి విద్యార్థి పాఠశాల ఆవరణలోనే చెప్పుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌లో బుధవారం జరిగింది.

ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గిరిజన విద్యార్థినిని కొంతకాలంగా ప్రేమ పేరుతో తోటి విద్యార్థి వేధిస్తున్నాడు. సదరు విద్యార్థిని అతడి ప్రేమను నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న ఆ విద్యార్థి బుధవారం మధ్యాహ్నం లంచ్‌ సమయంలో పాఠశాల ఆవరణలోనే అందరూ చూస్తుండగానే తన చెప్పుతో విద్యార్థినిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఆ విద్యార్థిని భయాందోళనకు గురైంది.

విద్యార్థినిపై దాడి జరిగిన విషయం ప్రిన్సిపాల్‌కు తెలిసినప్పటికీ పాఠశాలకు చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ కె.వీరబాబును వివరణ కోరగా తమ పాఠశాలలో గిరిజన విద్యార్థినిపై తోటి విద్యార్థి దాడికి పాల్పడిన విషయం వాస్తవమేనని, ఈ ఘటనపై ఇరువురి తల్లిదండ్రులు, గ్రామపెద్దలను పిలిపించి మాట్లాడి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: గురుకులంలో విద్యార్థిని ప్రసవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement