హొసపేటె: ఓ వివాహ వేడుకలో ఇద్దరు ప్రముఖ నేతలు కలుసుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే.శివకుమార్, మాజీ మంత్రి ఆనంద్‌సింగ్ భేటీ అయి కొద్దిసేపు ముచ్చటించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. హొసపేటె తాలూకాలో గురువారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే భీమానాయక్ కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ హాజరయ్యారు. ఇదే వేడుకకు వచ్చిన మాజీ మంత్రి ఆనంద్‌సింగ్.. ముఖ్యమంత్రిని కలిశారు. ఇద్దరు నేతలు కొంత సేపు మాట్లాడుకున్నారు. వీరి మధ్య జరిగిన చర్చ కేవలం మర్యాదపూర్వక పలకరింపుకే పరిమితమైందా? లేక రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయా? అనే చర్చ మొదలైంది.


