కనకదాస సేవలు ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

కనకదాస సేవలు ఆదర్శం

Nov 28 2026 1:56 AM | Updated on Nov 28 2026 1:56 AM

రాయచూరు రూరల్‌: సమాజంలోని మహనీయుల్లో కనకదాస ఉత్తముడు. ఆయన జీవిత విధానాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని నగర ఎమ్మెల్యే శివరాజ్‌ పాటిల్‌, గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్‌ సూచించారు. శుక్రవారం గంజ్‌ సర్కిల్‌ వద్ద నగర సభ, జిల్లా పరిపాలన యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కన్నడ సంస్కృతి శాఖ, కురుబ సమాజం నాయకుల ఆధ్వర్యంలో కనకదాస జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కనకదాస విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఊరేగింపు నిర్వహించారు. అలాగే పండిత సిద్ధరామ జంబలదిన్ని రంగమందిరంలో కనకదాస చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా అధికారి పూవిత మాట్లాడుతూ.. మానవుడు దుర్మార్గపు మార్గంలో వెళ్లకుండా సన్మార్గంలో నడవాలని బోధించిన మహనీయుడు కనకదాస అని కొనియాడారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన ఎన్నడూ పని చేయలేదని.. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తన పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఈశ్వర్‌ కుమార్‌ కాందూ, ఎస్పీ అరుణాంగ్షు గిరి, కురుబ సమాజం సభ్యులు వేణుగోపాల్‌, హన్మంతు తదితరులు పాల్గొన్నారు. అలాగే లింగసుగూరు ఎమ్మెల్యే వజ్జల్‌ మానప్ప, మాన్వి ఎమ్మెల్యే హంపయ్య నాయక్‌, సింధనూరు ఎమ్మెల్యే హంపనగౌడ బాదర్లి ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన కనకదాస జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

బళ్లారి వైద్య భవన్‌లో..

బళ్లారి రూరల్‌: శ్రేష్ట సాధువు కనకదాస 500 ఏళ్ల క్రితమే కులవివక్ష, మూఢనమ్మకాలపై కీర్తనల రూపంలో ప్రశ్నించారని విశ్రాంత ఇంజనీర్‌, పరిశోధకుడు డాక్టర్‌ లింగదహళ్లి హలప్ప తెలిపారు. బీఎంసీఆర్‌సీ, బీఎంసీఆర్‌సీ కనక ఉద్యోగుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య భవన్‌లో కనకదాస జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 16వ శతాబ్దానికి చెందిన కనకదాస.. తిరుపతి తిమ్మప్ప అనుగ్రహం పొందారని గుర్తు చేశారు. వైష్టవ ధర్మాన్ని ఆచరిస్తూ పల్లెపల్లెన తిరుగుతూ ప్రజలకు దైవచింతనపై ఆసక్తి కలిగించారన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారని పేర్కొన్నారు. వ్యాజ్యస్తుతి, ద్వైత సిద్ధాతాలతో ఇష్ట దైవాన్ని కీర్తనలతో ప్రశ్నించేవారన్నారు. ఆనాడే కులవివక్ష, మూఢనమ్మకాలపై గళమెత్తారని తెలిపారు. కనకదాస గురించి 1988 అనంతరం ప్రజలకు విస్తృతంగా తెలిసిందని చెప్పారు. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన ఎంబీబీఎస్‌ విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో దమ్మూరు లింగేశ్వర, శ్రీబనశంకరి దేవి శక్తిపీఠ మహాసంస్థాన పీఠాధిపతి గోవర్థనానందపురి మహాస్వామి, బీఎంసీఆర్‌సీ డీన్‌ అండ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మరిరాజ్‌జీర్‌, బీఎంసీఆర్‌సీ కళాశాల ప్రిన్స్‌పాల్‌ డాక్టర్‌ మల్లికార్జున, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌, టీబీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.వి.మురుగేశ్‌, నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నందిని, ఎస్‌.బాగ్యమ్మ, నర్సింగ్‌ సూపరింటెండెంట్లు ఏ.జ్యోతిలక్ష్మి, సంపత్‌ కుమార్‌, బసవణ్ణ, కనకదాస ఉద్యోగుల సంఘ ప్రముఖులు డాక్టర్‌ కె.చంద్రశేఖర్‌, డాక్టర్‌ బి.విశాలాక్షి, సణ్ణ ఎర్రిస్వామి, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

హొసపేటెలో..

హొసపేటె: జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కన్నడ, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని కనక సర్కిల్‌ వద్ద శుక్రవారం కనకదాస జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే హెచ్‌.ఆర్‌.గవియప్ప, జిల్లా డిప్యూటీ కమిషనర్‌ కవితా ఎస్‌.మన్నికేరి, జిల్లా ఎస్పీ ఎస్‌.జాహ్నవి తదితర ప్రముఖులు కనకదాస విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహనీయుడు సమాజానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. కనకదాస తన రచనలు, కీర్తనల ద్వారా భక్తిభావంతో పాటు సమానత్వం, మానవత్వం, సామాజిక ఐక్యత వంటి విలువలను ప్రజలకు చాటి చెప్పారని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గం నేటి సమాజానికి ఆదర్శప్రాయమని తెలిపారు. కార్యక్రమంలో అదనపు డిప్యూటీ కమిషనర్‌ పీఎన్‌.లోకేష్‌, డీవైఎస్పీ మురళీధర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఎర్రగుడి శివకుమార్‌, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రాయచూరు రూరల్‌: కనకదాస విగ్రహానికి నివాళులర్పిస్తున్న నాయకులు

బళ్లారి రూరల్‌: కనకదాస చిత్రపటానికి పూజలు చేస్తున్న స్వామీజీ

ఘనంగా భక్త కనకదాస జయంతి

పూలమాలలతో నివాళులర్పించిన

ప్రజాప్రతినిధులు, అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement