వేయిస్తంభాల ఆలయంలో శివరాత్రి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

వేయిస్తంభాల ఆలయంలో శివరాత్రి వేడుకలు

Feb 16 2026 8:25 AM | Updated on Feb 16 2026 8:25 AM

వేయిస

వేయిస్తంభాల ఆలయంలో శివరాత్రి వేడుకలు

కురవి వీరభద్రస్వామి స్వామి వారి ఆలయం బయట భక్తులు

హన్మకొండ కల్చరల్‌: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, వేదపండితుడు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్‌, సందీప్‌శర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ ధరణికోట అనిల్‌కుమార్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. లక్షమందికి పైగా భక్తులు క్యూలైన్లలో స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి దేవాలయం జాగరణ చేసే భక్తులతో కిక్కిరిసిపోయింది. రాత్రి 12 గంటలకు వేదపండితులు లింగోద్భవపూజను నిర్వహించారు. తేనె, నెయ్యి, పెరుగు, చక్కెర, పండ్ల రసాలతో మహారుద్రాభిషేకం చేశారు.

ప్రముఖుల పూజలు..

వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నీలిమా దంపతులు, గోదాదేవి, విష్ణువర్ధన్‌రెడ్డి దంపతులు, వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, సిరికొండ మధుసూదనాచారి, కుడా చైర్మన్‌ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, దాత గాయత్రి గ్రానైట్స్‌ అధినేత వద్దిరాజు వెంకటేశ్వర్లు, ఉమామహేశ్వరి దంపతులు, హైకోర్టు జడ్జి జస్టిస్‌ సాంబశివనాయుడు, నగర సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌, ఏసీపీలు నరసింహారావు, సత్యనారాయణ, సీఐ మచ్చ శివకుమార్‌, దేవాదాయశాఖ డీసీ రామల సునీత, వాగ్దేవి కళాశాలల చైర్మన్‌ చందుపట్ల దేవేందర్‌రెడ్డి, మండువ శేషగిరిరావు, బిల్డర్‌ సీతారామారెడ్డి, వేముల సత్యమూర్తి, రాంరెడ్డి, బీజేపీ నాయకురాలు రావుపద్మ, మాజీ ఎమ్మెల్యే సతీమణి దాస్యం రేవతి, కార్పొరేటర్‌ లోట వెంకటేశ్వర్లు, సినీగేయ రచయిత కాసర్ల శ్యామ్‌ తదితరులు స్వామివారికి అభిషేకాలు జరుపుకున్నారు. పోలీసులు, ఆరోగ్య సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, మున్సిపల్‌ పారుశుద్ద్యసిబ్బంది, శ్రీరుద్రేశ్వరసేవా సమితి సభ్యులు గండ్రాతి రాజు, చొల్లేటి కృష్ణమాచారి, కట్ల రాజు, సురేశ్‌కుమార్‌, కాశిలింగాచారి, నవీన్‌కుమార్‌ సేవలందించారు.

శోభాయమానం కల్యాణం..

దేవాలయ ప్రాంగణంలో సాయంత్రం 5.45 గంటలకు రుద్రేశ్వరీరుద్రేశ్వరస్వామి కల్యాణాన్ని గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉభయదాతలుగా వ్యవహరించిన వద్దిరాజు వెంకటేశ్వర్లు దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మాడిశెట్టి సాంబయ్య దంపతులు వధువు తరఫున కల్యాణకర్తగా వ్యవహరించారు. గారపల్లి మహేశ్వరశర్మ శివతత్వంపై ధార్మికప్రసంగం చేశారు, బొడిగె లక్ష్మీనారాయణ భాగవతార్‌ హరికథ, బొంపల్లి సుధీర్‌రావు, రేణుక బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు అలరించాయి.

కల్యాణ మండపంలో ఉత్సవ మూర్తులకు

కల్యాణ తంతు నిర్వహిస్తున్న అర్చకులు

కల్యాణంలో పాల్గొన్న భక్తులు

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీశుభానంద–ముక్తీశ్వర స్వామి వార్ల కల్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు కలెక్టర్‌ రాహుల్‌శర్మ దంపతులు ఆనవాయితీ ప్రకారం ఈఓ కార్యాలయం నుంచి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకొచ్చారు. ఉత్తర రాజగోపురం బయట నూతనంగా నిర్మించిన కల్యాణ మండపంలో ఉత్సవమూర్తులకు ఆలయ ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ, ముఖ్య అర్చకులు రాముశర్మ, అర్చకులు వెల్ది శరత్‌చంద్రశర్మ, కాకిరాల పవన్‌శర్మ, బైకుంఠపాండా, రామకృష్ణశర్మ, రాజ్‌కుమార్‌, విజయ్‌కుమార్‌లు కల్యాణ తంతు అంగరంగా వైభవంగా జరిపించారు. కల్యాణ తంతు వీక్షించడానికి భక్తుల సౌకర్యార్థం రెండు ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ కోట రాజబాబు, ఈఓ మహేశ్‌, సర్పంచ్‌ వెన్నపురెడ్డి మోహన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ సుధీర్‌, అడిషనల్‌ కలెక్టర్‌ విజయలక్ష్మి, తహసీల్దార్‌ రామారావు, మహదేవపూర్‌ సర్పంచ్‌ హసీనభాను తదితరులు పాల్గొన్నారు. కల్యాణం సందర్భంగా అంతకు ముందు ఆనవాయితీ ప్రకారం కాళేశ్వరానికి చెందిన గందెసిరి సత్యనారాయణ, మధు, రమేశ్‌ సోదరులు తమ ఇంటి నుంచి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

నేత్రపర్వంగా మల్లికార్జునస్వామి కల్యాణం

వైభవోపేతంగా శ్రీశుభానంద–

ముక్తీశ్వరుల పెళ్లి..

పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్‌

దంపతులు

అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తజనం

వేయిస్తంభాల ఆలయంలో శివరాత్రి వేడుకలు1
1/5

వేయిస్తంభాల ఆలయంలో శివరాత్రి వేడుకలు

వేయిస్తంభాల ఆలయంలో శివరాత్రి వేడుకలు2
2/5

వేయిస్తంభాల ఆలయంలో శివరాత్రి వేడుకలు

వేయిస్తంభాల ఆలయంలో శివరాత్రి వేడుకలు3
3/5

వేయిస్తంభాల ఆలయంలో శివరాత్రి వేడుకలు

వేయిస్తంభాల ఆలయంలో శివరాత్రి వేడుకలు4
4/5

వేయిస్తంభాల ఆలయంలో శివరాత్రి వేడుకలు

వేయిస్తంభాల ఆలయంలో శివరాత్రి వేడుకలు5
5/5

వేయిస్తంభాల ఆలయంలో శివరాత్రి వేడుకలు

Advertisement
 
Advertisement
Advertisement