ఫైనల్‌కు చేరిన మహిళా క్రికెట్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ కేంద్రంగా గత ఐదు రోజులుగా జరుగుతున్న అంతర్‌జిల్లాల టీ–20 మహిళల క్రికెట్ పోటీలు ఫైనల్‌కు చేరుకున్నాయి. వంగాలపల్లిలోని డబ్ల్యూసీఏ క్రీడా మైదానంలో శుక్రవారం మహబూబ్‌నగర్, ఖమ్మం జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్‌లో మహబూబ్‌నగర్ జట్టు 18 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఖమ్మం జట్టు 17 ఓవర్లలో కేవలం 69 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో వరంగల్, ఆదిలాబాద్ జట్లు తలపడగా వరంగల్ 20 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 149 పరుగులను సాధించింది. ఆదిలాబాద్ జట్టు 102 పరుగులు సాధించి అన్ని వికెట్లను కోల్పోయింది. దీంతో నేడు(శనివారం) వరంగల్, మహబూబ్‌నగర్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు.
తలపడనున్న వరంగల్, మహబూబ్‌నగర్ జట్టు


