నిబంధనలకు నీళ్లు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలకు నీళ్లు

Feb 10 2026 7:55 AM | Updated on Feb 10 2026 7:55 AM

నిబంధనలకు నీళ్లు

నిబంధనలకు నీళ్లు

ఇష్టారాజ్యంగా ఇటుక బట్టీల నిర్వహణ

అధికారుల విచారణలో బహిర్గతం

బయ్యారం: మండలంలో అక్రమంగా ఇటుకబట్టీలు నిర్వహిస్తున్నారని ఓ వ్యక్తి హెచ్‌ఆర్‌సీలో ఇచ్చిన ఫిర్యాదుతో సోమవారం మండలంలోని కొత్తపేట, నామాలపాడు పంచాయతీల్లో ఏడుశాఖల అధికా రులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. మండలంలో అక్రమంగా ఇటుకబట్టీలు నిర్వహిస్తున్నారని 2022లో లింగగిరికి చెందిన నరేశ్‌ హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేశాడు. హెచ్‌ఆర్‌సీ ఆదేశాల మేరకు రెవెన్యూ, పంచాయతీరాజ్‌, అటవీ, పొల్యూషన్‌, మైనింగ్‌, పరిశ్రమలు, గిరిజనశాఖకు చెందిన అధికారులు ఇటుకబట్టీలను సందర్శించారు. ప్రభు త్వ నిబంధనల ప్రకారం కొన్ని ఇటుకబట్టీల నిర్వహణ సాగడం లేదని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ విషయంపై అధికారులు తమ విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని విలేకరులకు తెలిపారు. విచారణలో డీఎల్‌పీఓ స్వరూప, పొల్యూషన్‌ అధికారి సుభాష్‌నాయక్‌, పరిశ్రమల శాఖ జీఎం శ్రీమన్నారాయణరెడ్డి, తహసీల్దార్‌ నాగరాజు, ఎఫ్‌ఆర్‌ఓ సువర్చల, ఏఓ రాజు, ఏటీడీఓ భాస్కర్‌, డీఆర్వో రమేశ్‌, ఆర్‌ఐ సందీప్‌, పంచాయతీ కార్యదర్శి సంగీత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement