సీఎం సభ హెలిపాడ్‌ ఏర్పాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

సీఎం సభ హెలిపాడ్‌ ఏర్పాట్ల పరిశీలన

Feb 7 2026 2:01 PM | Updated on Feb 7 2026 2:01 PM

సీఎం

సీఎం సభ హెలిపాడ్‌ ఏర్పాట్ల పరిశీలన

గణపురం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూరు శివారులో ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రానున్నారు. ఈనేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేస్తున్న హెలిపాడ్‌ పనులను శుక్రవారం కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎస్పీ సంకీర్త్‌ పరిశీలించారు. హెలిపాడ్‌ పరిసర ప్రాంతాల భద్రత, వాహనాల పార్కింగ్‌, నిరంతర విద్యుత్‌ సరఫరా, వైద్యకేంద్రాల ఏర్పాటు, అగ్నిమాక చర్యలు తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని పటిష్ట భద్రతాచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి సీఎం సభను విజయవంతం చేయాలని సూచించారు. వారి వెంట అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, డీఎస్పీ సంపత్‌ రావు, తదితరులు ఉన్నారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి

నర్మెట (తరిగొప్పుల): విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని బొంతగట్టు నాగారంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై శ్రీదేవి తెలిపిన వివరాలు.. తప్పిపోయిన బర్రె కోసం పొరుగు రైతుల వ్యవసాయ బావుల వద్ద వెతికే క్రమంలో మొక్కజొన్న చేనుకు అడవి పందుల నుంచి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగలు తగిలి ఇరుమల్ల బాపురాజు (38) మృతి చెందాడు. మృతుడి సోదరుడు రవి ఫిర్యాదుతో ముగ్గురిపై శుక్రవారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఎస్సై తెలిపారు. బాపురాజుకు భార్యతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

సీఎం సభ హెలిపాడ్‌ ఏర్పాట్ల పరిశీలన 
1
1/2

సీఎం సభ హెలిపాడ్‌ ఏర్పాట్ల పరిశీలన

సీఎం సభ హెలిపాడ్‌ ఏర్పాట్ల పరిశీలన 
2
2/2

సీఎం సభ హెలిపాడ్‌ ఏర్పాట్ల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement