ట్రాఫిక్ సమస్య పునరావృతం కావొద్దు
● సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు
ఎస్‌ఎస్ తాడ్వాయి: మళ్లీ రానున్న జాతరలో ట్రాఫిక్ సమస్య పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ములుగు కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్‌తో కలిసి మేడారంలోని వీవీఐపీ వాహనాల పార్కింగ్ స్థలం, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని పరిశీలించారు. జాతర సమయంలో ట్రాఫిక్ జామ్‌కు గల కారణాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ జాతరలో ఎదురైన ఇబ్బందులు, అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 2028లో వచ్చే జాతరలో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా పటిష్ట ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. మళ్లీ జాతరలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు. జాతర విజయవంతానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ సమస్య పునరావృతం కావొద్దు


