యువజనోత్సవాలతో సృజనాత్మకత | - | Sakshi
Sakshi News home page

యువజనోత్సవాలతో సృజనాత్మకత

Feb 6 2026 8:52 AM | Updated on Feb 6 2026 8:52 AM

యువజనోత్సవాలతో సృజనాత్మకత

యువజనోత్సవాలతో సృజనాత్మకత

కేయూ వీసీ ప్రొఫెసర్‌ ప్రతాప్‌రెడ్డి

కేయూ క్యాంపస్‌: విద్యార్థుల్లో దాగిన సృజనాత్మక తను వెలికి తీసుకునేందుకు యువజనోత్సవాలు దోహదపడతాయని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. కేయూ ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్‌ జిల్లాస్థాయి యువజనోత్సవాల్లో గురువారం వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడారు. యువతలో నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ లక్షణాలు, సామాజిక స్పృహ పెంపొందించడంలో ఇలాంటి ఉత్సవాలు దోహదం చేస్తాయని అన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వంటి సంస్థల వల్ల విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో వారికి సామాజిక స్పృహ పెంపొందుతుందని అన్నారు. అనంతరం కేయూ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ ఈసం నారాయణ, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జ్యోతి, వైస్‌ ప్రిన్సిపాల్‌ రెహమాన్‌, ఆచార్య ఇస్తారి తదితరులు మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు సేవా గుణం అలవరుచుకోవాలని సూచించారు.

గెలుపోటములు సహజం

క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం తెలిపా రు. వివిధ పోటీల్లో గెలుపొందిన వలంటీర్లకు గురువారం ఆయన బహుమతులను అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు శ్రీదేవి, శ్రీలత, చందర్‌, రమేష్‌ పాల్గొన్నారు. మిమిక్రీ కళాకారుడు జబర్దస్త్‌ ఫేమ్‌ వెంకీ తన మిమిక్రీ ప్రదర్శనతో అలరించారు. కళాకారుడు జీవన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement