పదేళ్లలో అభివృద్ధిని విస్మరించిన బీఆర్‌ఎస్
● వరంగల్ ఎంపీ కడియం కావ్య
స్టేషన్‌ఘన్‌పూర్: గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులోని 6, 7, 8, 9వ వార్డుల్లో, స్టేషన్‌ఘన్‌పూర్ పట్టణంలోని 10, 11వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కలిసి ఎంపీ కావ్య గురువారం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో తిరుగుతూ చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం ఛాగల్లు, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆమె మాట్లాడారు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ ఏర్పడిన వెంటనే ఎమ్మెల్యే కడియం శ్రీహరి రూ.50 కోట్లు నిధులు తీసుకొచ్చి అభివృద్ది పనులు ప్రారంభించారని తెలిపారు. గత పాలకులు అవినీతి, ఆక్రమణలు, బెదిరింపులు, భూకబ్జాలతో పాలన సాగించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీహరి ఇప్పటివరకు రూ.1,400 కోట్లు నిధులు తీసుకొచ్చారని, తన ఎంపీ నిధుల నుంచి నియోజవకర్గానికి రూ.3.50 కోట్లు నిధులు మంజూరు చేశానని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో మరో 500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, అన్నం బ్రహ్మారెడ్డి, పోగుల సారంగపాణి, అభ్యర్థులు కనకం రమేష్, చాతరబోయిన సత్యనారాయణ, అన్నెపు సుమలత, సౌదరపల్లి సంపత్, నీల రాజమ్మగట్టయ్య, తోకల అనూష, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తస్మాత్ జాగ్రత్త..!
పరకాల: ఎన్నికల ప్రచారాల్లో హద్దులు దాటితే అంతే సంగతులు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పరకాల పట్టణంలో అన్ని రాజకీయ పార్టీల ప్రచార హోరు కొనసాగుతోంది. అయితే ప్రచారంలో ఎన్నికల కోడ్ ప్రకారమే ర్యాలీలకు ప్రజలను తరలించడం.. వాహనాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం హద్దు దాటినా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎఫ్‌ఎస్ టీం ఏర్పాటు చేసిన కెమెరాలో బంధించి చర్యలు తీసుకునే ప్రమాదం ఉంటుంది. ప్రచారంలో డబ్బు, మద్యం పంచినా.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా కేసులపాలు కాకతప్పదు.
పదేళ్లలో అభివృద్ధిని విస్మరించిన బీఆర్‌ఎస్


