స్టేషన్ @ 70
గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీ వరకు ఘన్‌పూర్ ప్రస్తానం
స్టేషన్‌ఘన్‌పూర్: మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న స్టేషన్ ఘన్‌పూర్ గతేడాది జనవరిలో మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్‌ఘన్‌పూర్ ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న మున్సిపాలిటీ కల ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవతో ఎట్టకేలకు నెరవేరింది. ఘన్‌పూర్‌కు జంటపట్టణంగా ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ శివునిపల్లి, ఛాగల్లు గ్రామాలను కలిపి స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. ఘన చరిత్ర ఉన్నందున స్టేషన్‌ఘన్‌పూర్‌కు ఆపేరు వచ్చిందని, గతంలో ఇక్కడ పండిన సాంబ బియ్యానికి ప్రత్యేక గుర్తింపు ఉండేదని, నిజాంకాలం నుంచే రైల్వేస్టేషన్ ఉండేందని స్థానికులు చెబుతుండగా.. పురాతన శివాలయం, రిజర్వాయర్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇక్కడి ప్రత్యేకలు. కాగా, మున్సిపాలిటీగా మారిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలతో రాజకీయ పార్టీల నేతలు.. ఓటర్లు బిజీగా మారారు. ఇదిలా ఉండగా.. తొలి చైర్మన్ ఎవరనే అంశంపై ఆసక్తి నెలకొంది.
పంచాయతీరాజ్ చట్టం ఏర్పడిన 1956 నుంచి పలువురు సర్పంచ్‌లుగా పనిచేసి స్టేషన్‌ఘన్‌పూర్‌ను అభివృద్ధిచేశారు. ఘన్‌పూర్ మొదటి సర్పంచ్‌గా కలకోట కృష్ణ్ణమాచార్యులు పనిచేయగా.. అనంతరం అంబటి రాఘవరాజు, చింతకుంట్ల నారాయణరెడ్డి, చింతకుంట్ల వెంకట్‌రెడ్డి, చింతకుంట్ల జనార్ధన్‌రెడ్డి, చింత బచ్చయ్య, గట్టు చేరాలు, నీరటి ప్రభాకర్, గట్టు రాజయ్య, గోనెల భద్రమ్మ, ఇల్లందుల ప్రతాప్, తాటికొండ సురేష్ పనిచేశారు. వీరిలో జనార్ధన్‌రెడ్డి 13 సంవత్సరాలు సర్పంచ్‌గా పనిచేశారు. 1982లో అంజయ్య ప్రభుత్వం నుంచి సర్పంచ్‌కు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. అంతకుముందు కేవలం వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించి వార్డు సభ్యుల ద్వారా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేవారు. ప్రత్యక్ష సర్పంచ్ ఎన్నికల్లో మొదటి సర్పంచ్‌గా చింత బచ్చయ్య గెలిచి ఏడున్నర సంవత్సరాలు పదవిలో కొనసాగారు. మొదట కేవలం ఐదు, ఆరు వార్డులతో ఉన్న స్టేషన్‌ఘన్‌పూర్ గ్రామ పంచాయతీ గత ఏడాది వరకు 16 వార్డులుగా విస్తరించింది. అయితే ప్రస్తుతం స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి, ఛాగల్లు కలిపి మున్సిపాలిటీ చేయగా మొత్తం 18 వార్డులుగా విభజించారు.
స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ వివరాలు ఇలా..
విస్తీర్ణం 48.24 చదరపు కి.మీ.
వార్డులు 18
జనాభా 30,527
ఓటర్లు 18,550
పురుషులు 8,913
మహిళలు 9,636
ఇతరులు 01
గృహాలు 7,408
సీసీ రోడ్లు 25.56 కి.మీ.
డ్రెయినేజీలు 17.08 కి.మీ.
స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి,
ఛాగల్లు గ్రామాలతో మున్సిపాలిటీ ఏర్పాటు
ప్రస్తుతం ఎన్నికల బిజీలో నాయకులు
తొలి చైర్మన్ ఎవరని ప్రజల్లో ఆసక్తి
స్టేషన్ @ 70
స్టేషన్ @ 70


