దళిత పక్షపాతి ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

దళిత పక్షపాతి ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

Feb 7 2026 2:01 PM | Updated on Feb 7 2026 2:01 PM

దళిత పక్షపాతి ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

దళిత పక్షపాతి ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

హన్మకొండ చౌరస్తా: వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దళిత, బడుగు, బలహీన వ ర్గాల పక్షపాతి అని కాంగ్రెస్‌ ఎస్సీ డిపార్ట్‌మెంట్‌ జి ల్లా చైర్మన్‌ డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్‌ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిపై బీ ఆర్‌ఎస్‌ నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ చేస్తు న్న అసత్య ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపారు. బీఎస్పీలో ఉన్నప్పుడు కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిచారని విమర్శించి, బీఆర్‌ఎస్‌లో చేరాక కాంగ్రెస్‌ పార్టీ బాంబులతో పేల్చిందనడం ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ద్వంద నీతికి నిదర్శనమన్నారు. దళితులను అవమానించారని ఎమ్మెల్యే నాయినిపై చేస్తున్న ప్రచారం లో ఏ మాత్రం నిజం లేదన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే దళితుల శ్మశాన వాటిక కోసం మూడెకరాల భూమిని కేటాయించిన ఘనత నాయినిదేనన్నారు. దళితులకు పనుల్లో భాగస్వామ్యం కల్పిస్తూ నాయకులుగా తీర్చిదిద్దిన వ్యక్తి ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలను చేస్తే కేటీఆర్‌ను జిల్లాలో తిరగనివ్వమని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ, ఎస్సీ డిపార్ట్‌మెంట్‌ రాష్ట్ర కన్వీనర్‌ ఆరూరి సాంబయ్య, వినయ్‌, ఎర్ర మహేందర్‌, సంగీత్‌, సుధాకర్‌, శ్వేత, అనిల్‌, జగన్‌గౌడ్‌, రాజ్‌కుమార్‌, శ్యామ్‌, ఝాన్సీ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ఎస్సీ డిపార్ట్‌మెంట్‌ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ రామకృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement