గుండె నొప్పితో ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతి
గూడూరు: గుండె నొప్పితో ఓ ప్ర భుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మట్టెవాడలో జరిగింది. కు టుంబీకుల కథనం ప్రకారం.. మట్టెవాడకు చెందిన బిజ్జ సంపత్‌కుమార్(42) మండల కేంద్రంలోని చంద్రుగూడెం ఎంపీపీఎస్‌లో ఎస్జీటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్తున్న క్రమంలో చాతీలో నొప్పి వస్తోందని భార్య శ్రుతితో చెప్పాడు. దీంతో ఆమె వెంటనే సమీప బంధువులకు చెప్పగా వారు హుటాహుటిన 108లో గూడూరు సీహెచ్‌సీకి తరలి స్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మండల ప్రభుత్వ ఉపాధ్యాయులు.. సంపత్‌కుమార్‌కు నివాళులర్పించారు.


