సాఫ్ట్‌వేర్ టు కౌన్సిలర్
మరిపెడ: మరిపెడ మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు నుంచి పోటీచేసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గంట్ల గౌతమ్‌రెడ్డి విజయం సాధించారు. గౌతమ్‌రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. తాను పుట్టిపెరిగిన ప్రాంతానికి సేవచేయాలనే ఆలోచనతో మరిపెడ మున్సిపాలిటీ 12వ వార్డు నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిపై 252 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నమ్మకంతో గెలిపించిన ప్రజలకు సేవచేసేందుకు ఇక నుంచి స్థానికంగానే ఉంటానంటున్నాడు ఈ నవ కౌన్సిలర్.


