23ఏళ్ల ప్రజాప్రతినిధికి ఓటమి! | - | Sakshi
Sakshi News home page

23ఏళ్ల ప్రజాప్రతినిధికి ఓటమి!

Feb 14 2026 9:05 AM | Updated on Feb 14 2026 9:05 AM

23ఏళ్ల ప్రజాప్రతినిధికి ఓటమి!

23ఏళ్ల ప్రజాప్రతినిధికి ఓటమి!

నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీ ఏర్పడక ముందు సర్పంచ్‌గా మూడు పర్యాయాలు (18సంవత్సరాలు), ఒకసారి ఎంపీపీగా (5సంవత్సరాలు) మొత్తంగా 23 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉన్న నల్లా మనోహర్‌రెడ్డికి ఈసారి జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. నర్సంపేట మున్సిపల్‌ 17వ వార్డు నుంచి పోటీ చేసిన మనోహర్‌రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అయూబ్‌ఖాన్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. సుదీర్ఘ కాలంగా ప్రజా ప్రతినిధిగా అభివృద్ధిలో తనకంటూ ప్రత్యేకతను సాధించుకున్న మనోహర్‌రెడ్డి కౌన్సిలర్‌గా ఓటమి పాలవడం ఆయన అభిమానుల్లో నిరాశను నింపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement