సర్పంచ్ నుంచి కౌన్సిలర్‌గా
నాడు కాంగ్రెస్‌కు 6.. నేడు బీఆర్‌ఎస్‌కు 6
నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు విచిత్ర తీర్పునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌కు 6 సీట్లతో ప్రజలు సరిపెట్టారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు అదేరీతిలో 6 సీట్లు సరిపెట్టడం చర్చనీయాంశఽంగా మారింది.
అప్పుడు పదకొండే.. ఇప్పుడూ పదకొండే
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత మొదటిసారి 2019లో జరిగిన ఎన్నికల్లో నాటి అధికార బీఆర్‌ఎస్ పార్టీ 11 వార్డుల్లో విజయం సాధించింది. 1, 4, 7వ వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు, 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. రెండోసారి జరిగిన ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడగా.. అధికార కాంగ్రెస్ పార్టీ యాదృశ్చికంగా 11 వార్డుల్లో విజయం సాధించడం గమనార్హం. 4, 8, 9, 14వ వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
జనగామ: 13వ వార్డులో రాజకీయాలు అందరినీ ఆశ్చర్యపరిచేలా మలుపుదిరిగాయి. 2020లో ఒక్క ఓటు తేడాతో అప్పటి కౌన్సిలర్ మల్లిగారి చంద్రకళ రాజు చేతిలో ఓడిపోయి కన్నీటి పర్యంతమైన పానుగంటి సువార్త.. ఈసారి అదే వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేశారు. ఆశ్చర్యకరంగా గతంలో ప్రత్యర్థిగా నిలిచిన చంద్రకళ రాజు ఈసారి ఆమెకు ప్రతిపాదకుడిగా నిలిచి అండగా ఉన్నారు. ప్రత్యర్థులు మద్దతుదారులుగా మారిన ఈ ఘటన జనగామ పట్టణంలోనే కాదు, మొత్తం రాజకీయ వాతావరణంలో కాలం, పరిస్థితులు, మనుషులు ఎప్పుడు ఒకే విధంగా ఉండవని మరోసారి చాటి చెప్పింది.
నాడు.. నేడు రీకౌంటింగ్
2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ తరఫున పానుగంటి సువార్త, కాంగ్రెస్ తరఫున మల్లిగారి చంద్రకళ పోటీ చేయగా, ఒక్కఓటు తేడాతో మూడు సార్లు రీకౌంటింగ్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం అదే వార్డు నుంచి సువార్త, కాంగ్రెస్ నుంచి మేడ శ్రీనివాస్ పోటీ చేయగా, 10 ఓట్ల తేడాతో సువార్త గెలుపొందగా, మూడు సార్లు రీకౌంటింగ్ చేశారు.
మహబూబాబాద్ రూరల్ : నాడు సర్పంచ్‌గా ప్రజలకు సేవలందించిన ఓ మహిళా ప్రజాప్రతినిధి ప్రస్తుతం మున్సిపల్ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డు రజాలిపేట గ్రామానికి చెందిన నీరుటి హైమ 2013 నుంచి 2018 వరకు రజాలిపేట గ్రామానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్‌గా పనిచేశారు. రజాలిపేట మున్సిపాలిటీలో విలీనమైన తర్వాత జరిగిన ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసిరాకపోవడంతో పోటీ చేయలేదు. ప్రస్తుతం ఏడో వార్డు జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో హైమ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆమె భర్త లక్ష్మీనారాయణ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
నాడు ఓడించి..
నేడు గెలిపించి
సర్పంచ్ నుంచి కౌన్సిలర్‌గా


