మేడారం జాతర విజయవంతం | - | Sakshi
Sakshi News home page

మేడారం జాతర విజయవంతం

Feb 11 2026 8:13 AM | Updated on Feb 11 2026 8:13 AM

మేడారం జాతర విజయవంతం

మేడారం జాతర విజయవంతం

హన్మకొండ: ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి మేడారం మహాజాతరను విజయవంతం చేశారని టీజీఎస్‌ ఆర్టీసీ కరీంనగర్‌ జోన్‌ ఈడీ సోలోమన్‌ అన్నారు. మంగళవారం వరంగల్‌ ములుగు రోడ్‌లోని ఆర్టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీలో ఆర్టీసీ మేడారం జాతర విజయవంతంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈడీ సోలోమన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఉద్యోగులు బస్సులు నడిపి జాతరను విజయవంతం చేశారని అభినందించారు. వరంగల్‌ రీజినల్‌ మేనేజర్‌ దర్శనం విజయ భాను మాట్లాడుతూ పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేసి వివిధ విభాగాల అధికారులతో సమన్వయం సాధించడంతో జాతర విజయవంతమైందన్నారు. అనంతరం జాతరలో విధులు నిర్వర్తించిన అధికారులు, ఉద్యోగులకు జ్ఞాపికలు అందించి అభినందించారు. డిప్యూటీ రీజినల్‌ మేనేజర్లు మహేశ్‌, కేశరాజు భానుకిరణ్‌, విజిలెన్స్‌, సెక్యూరిటీ ఆఫీసర్‌ రవీందర్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఎల్‌.రవీందర్‌, తదితరులు పాల్గొన్నారు.

టీజీఎస్‌ ఆర్టీసీ కరీంనగర్‌ జోన్‌

ఈడీ సోలోమన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement