శిథిలావస్థలో వసతిగృహం | - | Sakshi
Sakshi News home page

శిథిలావస్థలో వసతిగృహం

Feb 9 2026 7:53 AM | Updated on Feb 9 2026 8:30 AM

శిథిల

శిథిలావస్థలో వసతిగృహం

దెబ్బతిన్న ఎస్సీ బాలికల హాస్టల్‌ భవనం

ఒక పక్క కూలిపోయిన ప్రహరీ

మరమ్మతులు చేయాలని డిమాండ్‌

గార్ల: మండల కేంద్రంలో 30ఏళ్ల క్రితం నిర్మించిన ఎస్సీ బాలికల హాస్టల్‌ భవనం శిథిలావస్థకు చేరుకుంది. వర్షాకాలంలో భవనం స్లాబు పెచ్చులూడిన చోట కురుస్తుండడంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వసతిగృహంలో 50 మంది బాలికలు ఉంటూ స్థానిక బాలికోన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. వర్షాకాలంలో హాస్టల్‌ భవనంలోని వరండా, కొన్ని గదులు కురుస్తున్నాయని బాలికలు పేర్కొన్నారు. వంటగది పూర్తిగా దెబ్బతిన్నది. దీనికి తోడు హాస్టల్‌ ప్రహరీ సైతం ఒకపక్క కూలిపోవడంతో బాలికలకు రక్షణ కరువైంది. ఇప్పటికై నా సంబంధిత జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ అధికారులు స్పందించి హాస్టల్‌ భవనానికి వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యార్థినుల సమస్యలు తీర్చాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

శిథిలావస్థలో వసతిగృహం1
1/1

శిథిలావస్థలో వసతిగృహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement