ఓటు వేసిన ఎన్నికల సిబ్బంది
● 51 పోస్టల్ ఓట్లు పోల్ ..
జనగామ: పురపోరులో భాగంగా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీల్లో ఆదివారం పోస్టల్ ఓట్ల ప్రక్రియ కొనసాగింది. రెండు చోట్ల నామినేషన్ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, సిబ్బంది ఓట్లు వేశారు. జనగామ మున్సిపల్ పరిధిలో 48, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 3 ఓట్లు వేశారు. జనగామ మున్సిపల్ 4వ వార్డులో అత్యధికంగా 12 ఓట్లు పోల్ అయ్యాయి. కాగా, పోలింగ్ సామగ్రి, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరీ చేతన్ నితిన్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, సీఐ సత్యనారాయణరెడ్డి పరిశీలించారు. భద్రతాఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు విధానం, ఎన్నికల నిబంధనల అమలు తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.


