సీఎం రేవంత్‌కు గుణపాఠం చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌కు గుణపాఠం చెప్పాలి

Feb 9 2026 7:55 AM | Updated on Feb 9 2026 8:29 AM

సీఎం రేవంత్‌కు గుణపాఠం చెప్పాలి

సీఎం రేవంత్‌కు గుణపాఠం చెప్పాలి

బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి మోసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. ఈమేరకు ఆదివారం మున్సిపాలిటీ పరిధి శివునిపల్లి వివేకానంద చౌరస్తా వద్ద నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తానని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి.. ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి రూ.65వేలు బాకీ పడ్డాడని, ఒక్కొక్క పెన్షన్‌దారుడికి రూ.65వేలు బాకీ పడ్డాడని విమర్శించారు. ఆడపిల్లలకు స్కూటీలు ఏమయ్యాయని, నిరుద్యోగ భృతి లేదన్నారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇచ్చాకే, ఎన్నికల ముందు హామీలు నెరవేర్చాకే ప్రచారానికి రావాలని కాంగ్రెస్‌ నాయకులను నిలదీయాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్‌, నాయకులు నరహరి వేణుగోపాల్‌రెడ్డి, దొంతి దేవేందర్‌రెడ్డి, బొజ్జపల్లి సుభాశ్‌, పి.వెంకటేశ్వర్లు, ఐలోని అంజిరెడ్డి, ఇనుగాల యుగేంధర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు సట్ల వెంకటరమణ, అభ్యర్థులు పాలకుర్తి రాధికాసోమశేఖర్‌, వంగ వేణు, ఆమంచ నిర్మల, గట్టు స్వప్న, రాజారపు రజని, బూర్ల స్వాతి, కుమార్‌, రాజేందర్‌, సంపత్‌, దేవరాయ భాగ్య, గోనెల శిరీష, పొన్న రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement