లెఫ్ట్.. రైట్
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో మున్సి పల్ ఎన్నికలు రోజుకో తీరు మ లుపు తిరుగుతున్నాయి. గత అసెంబ్లీ, పార్ల మెంట్ ఎన్నికలు, తర్వాత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జతకట్టిన సీపీ ఐ ఇప్పుడు ప్రత్యర్థిగా మారింది. అప్పు డు మౌనంగా ఉన్న సీపీఎం నాయకులు ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తున్నారు. కాగా, పొత్తు వికటించడంతో సీపీఐ తమ పంథాను మా ర్చుకొని బీఆర్‌ఎస్‌తో స్నేహపూర్వక పొత్తుకు అంగీ కారం కుదుర్చుకుంది. దీంతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు చెరో వైపునకు చేరి ఎన్నికల బరిలో నిలిచాయి.
వికటించిన పొత్తుతో చెరోవైపు..
మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైన నాటి నుంచి కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేస్తాయని ఇరు పార్టీల నాయకులు బహిరంగంగా ప్రకటించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ రోజు వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో పొత్తు చెడిపోయింది. అయితే అసలు పొత్తు ఉంటుందో.. ఒంటరిగా పోటీ చేస్తుందని చర్చ జరిగిన సీపీఎం మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుంది. నాలుగు వార్డులు సీపీఎం అభ్యర్థులకు కేటాయించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందనే ఆరోపణ చేస్తూ.. ఒంటరి పోరుకు సిద్ధమైన సీపీఐతో బీఆర్‌ఎస్ నాయకులు మంతనాలు జరిపారు. దీంతో ఆ పార్టీతో స్నేహపూర్వక ఒప్పందం చేసుకున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో 18, 23వ వార్డుల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారం విరమించుకొని అక్కడ సీపీఐ అభ్యర్థులకు మద్దతు ఇస్తామని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ప్రకటించారు. అదే విధంగా ఈ రెండు వార్డులు మినహా మిగిలిన చోట్ల సీపీఐ మద్దతు బీఆర్‌ఎస్‌కే ఉంటుందని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. దీంతో కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఒకరు బీఆర్‌ఎస్‌తో, మరొకరు కాంగ్రెస్‌తో జతకట్టి ప్రచారం చేస్తున్నారు.
లాభమెంత.., నష్టమెంత..?
మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉభయ కమ్యూనిస్టులతో కలిసి పోటీకి దిగుతుందని సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రకటించారు. దీంతో సీపీఐ, సీసీఎం మద్దతుతో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తాం.. చైర్మన్ పీఠం దక్కించుకుంటామనే ధీమాతో ఉన్నారు. అదే విధంగా ఎవరు కలిసి వచ్చినా.. రాకపోయినా.. ఐదు మున్సిపాలిటీలు మేమే గెల్చుకుంటామనే ప్యూహంతో బీఆర్‌ఎస్ ఉంది. అయితే ఎన్నికల ముందు, తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు సీపీఐ జత కావడంతో అదనపు బలం వచ్చిందని.. దీంతో మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం మున్సిపాలిటీల్లో సీపీఐ ఓటు బ్యాంకు బీఆర్‌ఎస్‌కు పడే అవకాశం ఉందని.. దీంతో సునాయసంగా ఆయా మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని ఇరు పార్టీల నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా సీపీఐతో పొత్తు లేకపోయినా.. సీపీఎం కలిసిరావడం అదనపు బలమని, అధికారంలో ఉన్న పార్టీకి ప్రజల మద్దతు ఉంటుందని, దీంతో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు తమ ఖాతాలో చేరుతాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇలా ఇటు సీపీఐ మద్దతుతో ఉన్న బీఆర్‌ఎస్, అటు సీపీఎం మద్దతుతో పోటీలో ఉన్న కాంగ్రెస్ మాకే లాభం అంటే మాకే లాభం చేకూరుతుందని అంటున్నారు. అయితే చెడిన పొత్తులు ఏ పార్టీని చెడగొడుతాయో.. ఎవరికి లాభం చేకూరుస్తాయో.. ఓటర్లే నిర్ణయిస్తారని.. చివరకు ఏం జరుగుతుందో అనే చర్చ జిల్లాలో సాగుతోంది.
ఉభయ కమ్యూనిస్టులు చెరోదారి
అప్పుడు మిత్రులు.. ఇప్పుడు ప్రత్యర్థులు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో
వికటించిన సీపీఐ పొత్తు
మిత్రభేదంతో లాభనష్టాలపై చర్చ
లెఫ్ట్.. రైట్
లెఫ్ట్.. రైట్


