ఓట్ల లెక్కింపునకు పటిష్ట బందోబస్తు
● ఎస్పీ శబరీష్
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ శబరీష్ గురువారం తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 163 బీఎన్‌ఎస్‌ఎస్ (144 సెక్షన్) అమలు చేస్తున్నామన్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు, టపాకాయలు కాల్చ డం, విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధించినట్లు తెలి పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓట్ల లెక్కింపునకు హాజరయ్యే అభ్యర్థులు, వారి ఏజెంట్లు నిషే ధిత వస్తువులు అగ్గిపెట్టెలు, లైటర్లు, ఇంకు బాటిళ్లు, పేలుడు పదార్థాలు లేదా భద్రతకు హానికరమైన ఎలాంటి వస్తువులు కేంద్రంలోకి తీసుకురాకూడదని పేర్కొన్నారు. తనిఖీలు నిర్వహించే సిబ్బందికి పూర్తిగా సహకరించాలన్నారు.


