టీ–20 మహిళా క్రికెట్ చాంపియన్ ఆతిథ్య వరంగల్
● రన్నరప్ మహబూబ్‌నగర్
వరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ వేదికగా వారం రోజులు నిర్వహించిన అంతర్ జిల్లాల టీ–20 మహిళా క్రికెట్ పోటీలు శనివారం ముగిశాయి. కరుణాపురం సమీపం వంగాలపల్లిలోని డబ్ల్యూడీసీఏ మైదానంలో జరిగిన ఫైనల్‌లో వరంగల్, మహబూబ్‌నగర్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠ పోరులో చివరి బంతి వరకు ఇరుజట్లు నువ్వా?నేనా? అన్నట్లు తలపడ్డాయి. ఇందులో వరంగల్ స్పిన్నర్ల ధాటికి మహబూబ్‌నగర్ ఓటమి చెందింది. ముగింపు కార్యక్రమానికి హెచ్‌సీఏ సెలెక్టర్ హర్శనారాయణ, కీర్తన ముఖ్య అతిథులుగా హాజరై విజేత, రన్నరప్ జట్లకు ట్రోఫీలు అందజేశారు. వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ముగింపు వేడుకల్లో జిల్లా ఉపాధ్యక్షుడు నజీమొద్దీన్, మాజీ కార్యదర్శి మార్నేని ఉదయభానురావు, బండారి ప్రభాకర్, సదానందయాదవ్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.


