అడ్మిషన్ల ప్రక్రియలో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

అడ్మిషన్ల ప్రక్రియలో వేగం పెంచాలి

Feb 8 2026 4:20 AM | Updated on Feb 8 2026 4:20 AM

అడ్మిషన్ల ప్రక్రియలో  వేగం పెంచాలి

అడ్మిషన్ల ప్రక్రియలో వేగం పెంచాలి

టెమ్రిస్‌ డిప్యూటీ సెక్రటరీ జుబేదాబేగం

న్యూశాయంపేట : తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో విద్యార్థులను చేర్పించేలా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అడ్మిషన్ల ప్రక్రియలో వేగం పెంచాలని టెమ్రిస్‌ డిప్యూటీ సెక్రటరీ జుబేదాబేగం తెలిపారు. శనివారం హనుమకొండ ములుగురోడ్డులోని హనుమకొండ(బి1)గురుకులంలో ఉమ్మడి జిల్లా ప్రిన్సి పాళ్లు, అడ్మిషన్‌ ఇన్‌చార్జ్‌లతో ఏర్పాటు చేసిన సమీ క్షలో ఆమె మాట్లాడారు. పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల సమయం దగ్గర పడుతున్న దృష్ట్యా విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రెండు సీఓఈలు ఉన్నాయని, వాటిలో కూడా విద్యార్థులు అడ్మిషన్లు తీసుకునేలా చూడాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement