రైతులు ఏఈఓలను సంప్రదించాలి
బయ్యారం: ఏజెన్సీలో ‘యాప్’సోపాలు అనే శీర్షికన శనివారం సాక్షిలో ప్రచురితమైన వార్తాకథనానికి వ్యవసాయశాఖాధికారులు స్పందించారు. ఈ మేరకు మండల వ్యవసాయాధికారి రాజు ప్రకటనను విడుదల చేశారు. మండలంలోని ఇర్సులాపురానికి చెందిన రైతుకు గార్ల మండలంలో భూమి ఉన్నందున ఇప్పటి వరకు యూరియా అందలేదని ఆ మండల అధికారులతో మాట్లాడి యూరియా అందిస్తామని పేర్కొన్నారు. ఇదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో సెల్‌నెట్‌వర్క్ లేని గ్రామాల రైతులు ఏఈఓలను సంప్రదిస్తే యూరియాను బుక్ చేస్తారని తెలిపారు.
టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
గార్ల: 10వ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డీడీ దేశీరాంనాయక్ ఆదేశించారు. స్థానిక గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను శనివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదిలో విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించా లని సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థుల కు నాణ్యమైన భోజనం, స్నాక్స్ అందించా లని తెలిపారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని తెలిపారు. అ నంతరం ఆశ్రమ పాఠశాలలో నిర్మాణంలో ఉ న్న ఉపాధ్యాయుల క్వార్టర్స్‌ను పరిశీలించారు. పాఠశాల నుంచి విద్యార్థులు బయటికి వెళ్లకుండా వార్డెన్ అప్రమత్తంగా ఉండాలన్నారు. హెచ్‌ఎం జోగయ్య, ఉపాధ్యాయులు మేగ్యానాయ క్, హనుమంతు, పీడీ పద్మ, ఉన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి సీపీఐ పోరాటాలు
నెహ్రూసెంటర్: మున్సిపాలిటీ అభివృద్ధికి సీపీ ఐ అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సీపీఐ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఐని గెలిపించడం ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారానికి పోరాటాలు సాగిస్తూ, అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. మానుకోట మున్సిపాలిటీ ఎన్నికల కు సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మె ల్యే మురళీనాయక్ ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలుపు కోసం కీలకపాత్ర పోషిస్తే పొత్తుల విషయంలో సీపీఐ గొంతుకోశారని మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీ ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీని వాసరావు, జిల్లా కార్యదర్శి బి.విజయసారథి, సహాయ కార్యదర్శి అజయ్‌సారథిరెడ్డి, పెరుగు కుమార్, నవీన్, శ్రీదేవి వెంకన్న, సంధ్య శ్రావణ్, యాకమ్మ, ఫాతిమా, పాండురంగాచారి, వెంకన్న, వీరన్న, శ్రావణ్ పాల్గొన్నారు.
మెడికల్ షాపు యజమానిపై కేసు
సాక్షి, మహబూబాబాద్: నిబంధనలకు విరుద్దంగా మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపుపై పోలీస్, జిల్లా డ్రగ్స్ విభాగం అధికారులు ఉమ్మడిగా దాడులు నిర్వహించి మందులు స్వాధీనం చేసుకొని, షాపు నిర్వాహకులపై కేసు నమోదు చేసిన ఘటన శుక్రవారం మరి పెడ పట్టణంలో చోటు చేసుకుంది. జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఉమారాణి తెలిపిన వివరాల ప్రకా రం.. మరిపెడ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఖమ్మం పోలీసులకు పట్టుపడ్డారు. వారిని విచారించా రు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మరిపెడ పట్టణంలోని శ్రీలక్ష్మీగణపతి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్‌లో శుక్రవారం తనిఖీ చేశారు. ఈతనిఖీల్లో తెలంగాణ ఔషధ నియంత్రణ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ట్రమిడాల్ ఇంజక్షన్లు, ట్రమిడాల్ ట్యాబ్లెట్లు, ఆల్ఫాజోలం టాబ్లెట్లను అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో మెడికల్ షాపు రికార్డులను స్వాధీనం చేసుకుని, మత్తు మందులను సీజ్ చేసి, షాపు నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
రైతులు ఏఈఓలను సంప్రదించాలి
రైతులు ఏఈఓలను సంప్రదించాలి
రైతులు ఏఈఓలను సంప్రదించాలి


