నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షల ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) డిగ్రీ కోర్సుల మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను శనివారం యూనివర్సిటీలో వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ కళాశాల ప్రిన్సిపాల్ మల్లం నవీన్ ఫలితాలు వెల్లడించారు. బీఎస్సీలో 66.01 శాతం, బీఏలో 60శాతం, బీకామ్‌లో 75.79శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ టి. మనోహర్, పరీక్షల నర్సంపేట కళాశాల పరీక్షల నియంత్రణాధికారి ఎస్. కమలాకర్, అకడమిక్ కోఆర్డినేటర్ కందాల సత్యనారాయణ, అదనపు పరీక్షల నియంత్రణాఽధికారి రాజీరు, అధ్యాపకులు భద్రు, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.


