ప్రచార పదనిసలు | - | Sakshi
Sakshi News home page

ప్రచార పదనిసలు

Feb 8 2026 4:20 AM | Updated on Feb 8 2026 4:20 AM

ప్రచా

ప్రచార పదనిసలు

స్వేచ్ఛా కవాతు..

మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడం, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకున్న ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా శనివారం వర్ధన్నపేట పట్టణంలో సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ ఆదేశాల మేరకు పోలీసులు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఏసీపీ అంబటి నర్సయ్య నేతృత్వంలో జరిగిన కార్యక్రమాల్లో సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు సాయిబాబు, రాజు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మున్సిపాలిటీ

అభివృద్ధికి

మరో రూ.50 కోట్లు

నిరసన

పోటీ నుంచి తప్పుకునేలా

ఒత్తిడి తెస్తున్నారు

నెహ్రూసెంటర్‌: మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధి 20వ వార్డులో పోటీ నుంచి తప్పుకునేలా బీఆర్‌ఎస్‌ నేతలు, మరికొంత మంది ఒత్తిడి తెస్తున్నారని 20 వార్డు స్వతంత్ర అభ్యర్థి బానోత్‌ స్వాతి మద్దతుదారు బానోత్‌ శంకర్‌ మేసీ్త్ర ఆరోపించారు. ఈ మేరకు శనివారం మద్దతుదారులతో కలిసి వార్డులో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకొస్తున్న ప్రజా ఆదరణను చూసి తట్టుకోలేక, ప్రచారం చేయొద్దంటూ ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. వార్డు ప్రజల ఆశీస్సులతో పోటీలోనే ఉంటామని స్పష్టం చేశారు. కాగా, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నచ్చచెప్పడంతో ప్రచారానికి వెళ్లారు.

ఘన్‌పూర్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి హామీ

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి వచ్చే కోటాతోపాటు అదనంగా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తానని, మున్సిపాలిటీ అభివృద్ధికి మరో రూ.50 కోట్లు వచ్చేలా సీఎం రేవంత్‌కు సిఫారసు చేస్తానని రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీ చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పదేళ్లపాటు పేదల సొంతింటి నిర్మాణం కలగానే మిగిలిందని, ఒక్కరికి ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. మున్సిపల్‌ ఎన్ని కల ప్రచారంలో భాగంగా వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి స్టేషన్‌ఘన్‌పూర్‌, ఛాగల్లులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనగా ప్రధాన దారులు కిటకిటలాడాయి. అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్‌లో, ఛాగల్లులో ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. జన ప్రభంజనాన్ని చూస్తేనే వార్‌ వన్‌ సైడ్‌ అని తెలుస్తోందని, మున్సిపాలిటీలోని 18కి పద్దెనిమిది వార్డులను కాంగ్రెస్‌ గెలువబోతుందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో దొర హయాం నడిచిందని, సొల్లు మాటలు చెప్పి ప్రజలను దగా చేశారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం నడుస్తోందన్నారు. అనంతరం ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతోనే స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపాలిటీగా ఆవిర్భవించిందని, మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ పార్టీని మరోసారి ఆశీర్వదించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ నాయకులు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, బెలిదె వెంకన్న, అన్నం బ్రహ్మారెడ్డి, కనకం రమేష్‌, సత్యనారాయణ,సంపత్‌రాజ్‌, సుమతోపాటు ఆయా వార్డుల అభ్యర్థులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

– వర్ధన్నపేట

బ్యాలెట్‌ బాక్స్‌ రెడీ..

పరకాల: మున్సిపల్‌ పోరుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా పరకాల మున్సిపల్‌ కార్యాలయంలో 44 బ్యాలెట్‌ బాక్స్‌లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు కమిషనర్‌ అంజయ్య, తహసీల్దార్‌ విజయలక్ష్మి సమక్షంలో సీల్‌ చేశారు. ఈ నెల 11న నిర్వహించనున్న పోలింగ్‌కు బ్యాలెట్‌ బాక్స్‌లు తరలించనున్నారు.

ప్రచార పదనిసలు1
1/4

ప్రచార పదనిసలు

ప్రచార పదనిసలు2
2/4

ప్రచార పదనిసలు

ప్రచార పదనిసలు3
3/4

ప్రచార పదనిసలు

ప్రచార పదనిసలు4
4/4

ప్రచార పదనిసలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement