ప్రలోభాలకు దూరంగా..
ఇండిపెండెంట్లే కీలకం !
నా బాల్య వివాహం రద్దు చేయండి
మహబూబాబాద్ రూరల్ : బాల్ వివాహ్ ముక్త్ భారత్ క్యాంపెయినింగ్‌లో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చేస్తున్న విస్తృత ప్రచారానికి బా ల్య వివాహానికి గురైన ఓ బాలిక స్పందించింది. తనకు జరిగిన బాల్యవివాహాన్ని రద్దు చేయించాల ని కోరుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించింది. ఈ మేరకు న్యాయమూర్తి శనివారం ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. వివరాలి లా ఉన్నాయి.. కురవి మండలానికి చెందిన ఒక బాలిక వివాహం హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడితో గత ఏడాది ఏప్రిల్ 25న జరిగింది. అత్తవారింట్లో బాలిక ముభావంగా ఉండటం గమనించిన యువకుడి తరఫు బంధువులు ఫిర్యాదు చేయగా రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ మండలి స్పందించి బాలికను తల్లిదండ్రులకు అప్పగించింది. ఈనేపథ్యంలో బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమాల్లో భాగంగా న్యాయ సేవాధికార సంస్థ చేపట్టి న ప్రచారంతో బాల్యవివాహాన్ని కోర్టు ద్వారా రద్దు చేసుకోవాలని తెలుసుకున్న ఆ బాలిక తనకు న్యాయ సహాయం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శాలిని షాకెల్లి బాలికకు న్యాయసహాయం మంజూరుచేస్తూ న్యాయవాది బి.దేవిని న్యాయ సహాయ న్యాయవాదిగా నియమించారు. న్యాయవాది బాల్య వివా హ పూర్వపరాలు వివరిస్తూ జిల్లా న్యాయస్థానంలో కేసు దాఖలు చేయగా పరిశీలించిన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ ప్రతివాదులకు శనివారం నోటీసులు జారీ చేశారు. మార్చి 26న కోర్టుకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు.
స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం
సమాజహితానికి రెడ్ క్రాస్, రోటరీ సంస్థలు చేస్తు న్న సేవలు అభినందనీయమని జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. జిల్లా కోర్టులో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పత్రికా విలేకరులతో న్యా య సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో జడ్జితోపాటు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శాలిని షాకెల్లి మాట్లాడారు.
నాణ్యమైన సేవలు అందించాలి
మహబూబాబాద్ రూరల్ : ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ వైద్య ఆరోగ్య సిబ్బందికి సూచించారు. మహబూబాబాద్ మండలంలోని మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. సిజేరియన్ ఆపరేషన్ల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి అర్జున్, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ సమస్యలు పరిష్కరించేవారికే ఓటు
ప్రజలకు అందుబాటులో ఉండేవారినే ఆదరిస్తాం..
● సాక్షి చర్చావేదికలో మానుకోట ప్రముఖులు, ప్రజలు
మహబూబాబాద్ అర్బన్: మానుకోట మున్సిపాలిటీ 36 వార్డులతో 65,712 మంది ఓటర్లను కలిగి ఉంది. మహబూబాబాద్ పట్టణం అభివృద్ధి చెందాలంటే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించేవారికే ఓటు వేసి ఆదరిస్తామంటున్నారు.. ప్రజలు. శనివారం ఉదయం పట్టణంలోని ఎన్‌టీఆర్ స్టేడియంలో కాళోజీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు, రిటైర్డ్ ఉద్యోగులు, యువకులతో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చావేదికలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. మద్యం, మనీకి దూరంగా నిజాయితీగా పనిచేసేవారికే తమ మద్దతునిస్తామని స్పష్టం చేశారు.
ఇంటి నంబర్లు ఇవ్వాలి
జిల్లా కేంద్రంలని శివారు కాలనీలకు ఇంటి నంబర్లను ఏర్పాటు చేస్తే మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. పట్టణంలోని వార్డుల అభివృద్ధికి ఈ ఆదాయం ఉపయోగపడుతుంది. నెహ్రూ సెంటర్ నుంచి పత్తిపాక, మంగళకాలనీ వరకు రోడ్డు మధ్యలోనే నిలిచిపోయింది పూర్తి చేయాలి.
– జానీ, 34 వార్డు పత్తిపాక, మానుకోట
రింగ్‌రోడ్డు నిర్మించాలి
జిల్లా కేంద్రంలో సరైన రింగ్ రోడ్డు లేక భారీ వాహనాలు, గ్రానైట్ లారీలు రోడ్డులో వెళ్తున్నప్పుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మించాలి. ప్రధాన కూడలిలో భారీ వాహనాలు తిరగలేక ఇబ్బందిగా ఉంటుంది. రోడ్లు వెడల్పులు చేయాలి. నిజాయితీ పరులైన నాయకులకు ఓటు వేసి గెలిపించుకోవాలి.
– పెద్ది వెంకన్న, 17వ వార్డు, మానుకోట
పనిచేయించుకోవడం బాధ్యత
ఓటు వేయడం హక్కు.. గెలుపొందినవారితో పనిచేయించుకోవడం బాధ్యత. జిల్లా కేంద్రంలో ఉన్న ఆఫీసర్ల క్లబ్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలి. కూరగాయాల మార్కెట్‌ను నూతన సమీకృత మార్కెట్‌కు తరలించాలి. పాత బజారులో కూరగాయల మార్కెట్, మున్సిపాలిటీలో స్విమింగ్ ఫూల్‌ను ఏర్పాటు చేయాలి. షాపింగ్ మాల్స్‌కు పార్కింగ్ సౌకర్యం ఉంటేనే అనుమతులు ఇవ్వాలి. సిటిజన్ చార్జ్ ప్రకారం ప్రజలకు మున్సిపాలిటీ సేవలు అందించాలి. ప్రజలు ప్రలోభాలకు కాకుండా పని చేసే నితినీజాయితీగా ఉండే నాయకులకు ఓటు వేయాలి. – మైసా శ్రీనివాసులు,
తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ రాష్ట్ర కోకన్వీనర్
కోతులను తరిమేయాలి
12వ వార్డులో కోతుల బెడద ఎక్కువగా ఉంది. మున్సిపల్ ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థులు కోతులు, కుక్కల బెడద నివారించడంతోపాటు వార్డులో సమస్యల లేకుండా చేయాలి. నిజాం చెరువు అలుగుతో ఈదులపూపల్లి రోడ్డులో ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించాలి.
– ఆకుల వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఉద్యోగి, 12 వార్డు
కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు చేయాలి
పేదలకు అందుబాటులో ఉండేలా ప్రతీ వార్డులో ఒక ఫంక్షన్‌హాల్/ కమ్యూనిటీ ఏర్పాటు చేయాలి. అంబేడ్కర్ కల్పించిన ఓటు హక్కును మద్యానికి అమ్ముకోకుండా నిజాయితీపరులకు ఓటు వేస్తాం.
– కోవ్వకుల బాలకృష్ణ
పార్కులు నిర్మించాలి
మానుకోట జిల్లా కేంద్రంలో వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలకు సరైన ఆహ్లాదకరమైన గ్రీన్ పార్క్ లేక ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్యను పెంచి వార్డులో చెత్తా చెదారం తొలగించాలి. ప్రతీ కాలనీలో మంచినీటి పైప్‌లైన్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలి. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలి. అంటువంటి నాయకులను మాత్రమే ఎన్నుకుంటాం.
– మైస నాగయ్య, రిటైర్డ్ ఉద్యోగి, 27వ వార్డు
గ్రంథాలయం ఏర్పాటు చేయాలి
మానుకోట జిల్లా కేంద్రంలో ఒక గ్రంథాలయం ఉంది, పాత బజారులో గ్రంథాలయం ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. వివేకానంద సెంటర్ నుంచి స్టేడియం వరకు నిలిచిపోయిన రోడ్డు వెడల్పు పనులు పూర్తి చేయాలి. స్టేడియంలో మరుగుదొడ్లు, వాకింగ్ ట్రాక్ నిర్మించాలి. – జిలకర శ్రీహరి, 12 వార్డు
వార్డులను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
కౌన్సిలర్‌గా ఎన్నికయ్యేవారు ముందుగా వార్డు సమస్యలను తెలుసుకోవాలి. వార్డులో తాగునీరు, డ్రెయినేజీల సమస్యలను పరిష్కారించాలి. వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దాలి.
– మామిడాల సత్యనారాయణ, న్యాయవాది, మానుకోట
శ్మశానవాటిక నిర్మించాలి
మానుకోట మున్సిపాలిటి పరిధిలోని ఈదులపూసపల్లి 1వ వార్డుగా 2019లో మున్సిపల్‌లో విలీనమైంది. జీపీగా ఉన్నప్పుడు సర్పంచ్‌లే సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించారు. ఇంత వరకు మా వార్డులో శ్మశానవాటిక లేదు. సీసీ రోడ్లు వేసి సమస్యలను పరిష్కరించే నాయకులనే ఎన్నుకుంటాం.
– బుర్రగోవర్ధన్, ఈదులపూసపల్లి, మానుకోట
పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించాలి
వర్షకాలంలో భారీ వర్షాలు పడినప్పుడు వరదల ఇబ్బందిగా ఉంటుంది. 15వ వార్డులో సరైన డ్రెయినేజీలులేక ఆర్టీసీ కాలనీ వరద నీటితో మునిగిపోతుంది. వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించే నాయకులు, విద్యావంతులకు ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేస్తాం.
– పట్టాభి లక్ష్మయ్య, 15 వార్డు
వార్డు కార్యాలయం నిర్మించాలి
36 వార్డులో అంతర్గత డ్రెయినేజీలు నిర్మించాలి. జిల్లా కేంద్రంలో రెండో ఫ్‌లైవర్ నిర్మించాలి. రింగ్‌రోడ్డు ఏర్పాటు చేయాలి. ఖాళీ స్థలాల్లోని ముళ్ల పొదలను తొలగించి దోమల బెడద నివారించాలి. అన్ని హంగులతో వార్డు అభివృద్ధి చేసేవారినే ఎన్నుకుంటాం. ప్రతి వార్డులో వార్డు కార్యాలయం ఏర్పాటు చేస్తే ఎక్కడి సమస్య అక్కడే పరిష్కారం అవుతుంది. – నామిరెడ్డి వెంకట్‌రెడ్డి, 13వ వార్డు
నేడు భూపాలపల్లికి సీఎం రేవంత్‌రెడ్డి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు ఓ బాలిక వేడుకోలు
స్పందించి నోటీసులు జారీ చేసిన
జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ
ప్రలోభాలకు దూరంగా..
ప్రలోభాలకు దూరంగా..
ప్రలోభాలకు దూరంగా..
ప్రలోభాలకు దూరంగా..
ప్రలోభాలకు దూరంగా..
ప్రలోభాలకు దూరంగా..
ప్రలోభాలకు దూరంగా..
ప్రలోభాలకు దూరంగా..
ప్రలోభాలకు దూరంగా..
ప్రలోభాలకు దూరంగా..
ప్రలోభాలకు దూరంగా..
ప్రలోభాలకు దూరంగా..


