ఓట్ల రక్షణ..
సీల్ చేసిన ఓట్ల ప్యాకెట్ల వివరాలతో ఆర్వో ప్రొసీడింగ్స్ సిద్ధం చేసి అన్ని ప్యాకెట్లను పెద్ద స్టీల్ ట్రంక్‌లో వేసి ముద్రిస్తారు. ట్రంక్‌ను స్ట్రాంగ్ రూంలో భద్రపరుస్తారు. ఒక తాళం చెవి ట్రెజరీ అధికారికి, మరోటి జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉంచుతారు.
చెల్లుబాటైన బ్యాలెట్లు మాత్రమే లెక్కింపు
ఫామ్ 15,16 ప్రకారం బ్యాలెట్లను ధ్రువీకరించి సంబంధిత రికార్డులు నమోదు చేయాలి. లోపాలున్న ఫామ్‌ల్లో లేట్ రిసిఫ్ట్, రిజక్టెడ్‌ను గుర్తించాల్సి ఉంటుంది. లెక్కింపు హాల్‌లో మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు. స్కూల్ బ్యాగులు, పెద్ద వస్తువులు నిషేధం. కౌంటింగ్ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు, రిటర్నింగ్ అధికారులు, అబ్జర్వర్లు, పార్టీల ఏజెంట్లకు మాత్రమే అనుమతి.
నిబంధనల ప్రకారం లెక్కింపు..
ముందు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి వాటిని సంబంధిత టేబుళ్లకు పంపుతారు. అన్ని పోస్టల్ బ్యాలెట్లను ఫామ్–17 (అనుబంధం 38) ప్రకారం పరిశీలించాలి. లెక్కింపు సమయంలో పీఓ సంతకం, స్టాంప్, పోలింగ్ స్టేషన్ నంబర్‌తో కూడిన స్టాంప్ మూడింటిని చెక్ చేసుకున్న అనంతరం ఓకే అనుకున్న తర్వాతే బాక్స్‌ను ఓపెన్ చేస్తారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థితో పాటు కౌంటింగ్ ఏజెంట్, ఎన్నికల ఏజెంట్ ముగ్గురికి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది.
ఆర్వో పరిశీలన
అనంతరం తుది నిర్ధారణ
ఓట్ల లెక్కింపు ప్రారంభ సమయంలో బ్యాలెట్ బాక్స్ తెరిచి ప్రతీ 25 ఓట్లను కట్టగా ఏర్పాటు చేయాలి. వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రమ్ములో వేయాలి. మొత్తం బ్యాలెట్ అకౌంట్‌ను మ్యాచ్ చేస్తూ లెక్కింపు కొనసాగించాలి. ప్రతీ డ్రమ్ములో 40 కట్టలు (వెయ్యి ఓట్లు) ర్యాండమ్‌గా చెక్ చేయాలి. నోటా సహా ఏ పార్టీ పక్షపాతం లేకుండా పరిశీలించాలి. వెయ్యి ఓట్లకు వంద కట్లను తీసుకుని ఆర్వోకు పంపాలి. ఆర్వో పరిశీలన అనంతరం తుది నిర్ధారణ ఉంటుంది. బ్యాలెట్ పత్రాల తిరస్కరణకు కారణాలను ఆర్వోలు నిర్ణయిస్తారు.
లెక్కింపు అనంతరం అందరి సమక్షంలో
సంబంధిత అధికారులు బయటకొచ్చి విజేతల పేర్లు అధికారికంగా ప్రకటిస్తారు.
పారదర్శకతకు ప్రాధాన్యం..
ఎన్నికల లెక్కింపులో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ రిటర్నింగ్ అధికారి (ఆర్వో)తుది ఫలితాలు ప్రకటించాల్సి ఉంటుంది. పోలింగ్ స్టేషన్ వారీగా ఓట్ల సంఖ్య, రౌండ్ వారీగా అభ్యర్థుల ఓట్లు, నోటా, తిరస్కరణలు, పోస్టల్, టెండర్డ్ బ్యాలెట్లు వివరాలు సరిచూసి బ్లాక్ బోర్డుపై నమోదు చేయాలి. లెక్కింపులో తప్పిదాలు శిక్షార్హమని అధికారులు హెచ్చరిస్తున్నారు.
సమాన ఓట్లు...లాటరీ విధానం
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ అభ్యర్థులు సమానంగా అత్యధిక ఓట్లు సాధిస్తే రిటర్నింగ్ అధికారి లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఒకే పరిమాణం, రంగు గల ఐదు పోల్ చీట్టీలు ప్రతీ అభ్యర్థి పేరుతో తయారు చేసి బాగా కలిపి చీట్టీ తీస్తారు. ఎవరి పేరు వస్తే అతడికి ఒక అదనపు ఓటు వచ్చినట్లు భావించి గెలుపుగా ప్రకటిస్తారు.
రీకౌంట్ విధానం
రీకౌంట్ కోరితే కౌంటింగ్ ప్రక్రియ 1 నుంచి 2 నిమిషాలు నిలిపివేయబడుతుంది. అభ్యర్థి 15 నిమిషాల్లో లిఖితపూర్వకంగా ఆర్వోకు రాసివ్వాలి. సరైన కారణాలు ఉన్నప్పుడు మాత్రమే ఆర్వో రీకౌంట్‌కు అనుమతిస్తారు. పూర్తిగా లేదా పాక్షికంగా రీకౌంట్ జరగొచ్చు. తుది నిర్ణయం ఆర్వోదే ఉంటుంది.
ఓట్ల రక్షణ..


