గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

Apr 4 2026 8:19 AM | Updated on Apr 4 2026 8:19 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద గురువారం మధ్యాహ్నం గంజాయి తరలిస్తున్న ఒరిస్సాకు చెందిన సత్యరంజన్‌ బారెల్‌, దీప్తి మాయిస్వైన్‌లకు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ట్రెయినీ ఐపీఎస్‌ మనీషానెహ్రా తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మనీషానెహ్రా వివరాలు వెల్లడించారు. స్థానిక రైల్వేస్టేషన్‌ వద్ద ఎస్సై రాజేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా సత్యరంజన్‌, దీప్తి ఇద్దరు ఐదు బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా పట్టుకుని తనిఖీ చేశారు. దీంతో వారి వద్ద 46.4 కిలోల గంజాయి లభించగా స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌ నుంచి ముంబైలోని దాదర్‌కి రైలులో తరలించి విక్రయించేందుకు వెళ్తున్నట్లు నిందితులు అంగీకరించారు. నిందితుల వద్ద గంజాయితోపాటు రెండు మొబైల్‌ ఫోన్లు, రూ.2,690, రైలు టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ట్రెయినీ ఐపీఎస్‌ తెలిపారు. సమావేశంలో సీఐ వేణు, ఎస్సై రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement