లాభదాయకం.. కౌజు పిట్టల పెంపకం | - | Sakshi
Sakshi News home page

లాభదాయకం.. కౌజు పిట్టల పెంపకం

Apr 4 2026 8:19 AM | Updated on Apr 4 2026 8:19 AM

వ్యవసాయానికి అనుబంధంగా అనువైన పరిశ్రమ

లాభాలు గడిస్తున్న రైతు

దుగ్గొండి: మాంసాహార ప్రియులు కొత్త రుచులు ఆస్వాదిస్తున్నారు.. ఈక్రమంలో మటన్‌, చికెన్‌, చేపల స్థానంలో కౌజు పిట్టలు చేరుతున్నాయి. పోషకాలు పుష్కలంగా ఉండే కౌజు పిట్టల మాంసానికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఇదే కోవలో అభ్యుదయ రైతులు వ్యవయానికి అనుబంధంగా కౌజు పిట్టల పెంపకం చేపట్టి లాభాలు గడిస్తున్నారు. నేటి పరిస్థితులలో దినదినాభివృద్ధి చెందుతున్న చిన్నతరహా పరిశ్రమ కౌజు పిట్టల పెంపకం. వీటిని క్వయిల్‌ పక్షులని, జపనీస్‌ పక్షులని పిలుస్తారు. బాయిలర్‌ కోళ్లతో పోలిస్తే ఒక కోడిని పెంచే స్థలంలో 8నుంచి 10 పక్షులను పెంచవచ్చు. 4 వారాలు పెంచితే ఒక్కో పక్షి 150 నుంచి 180 గ్రాములకు బరువు తూగుతుంది.

వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు బీరం శ్రీనివాసరెడ్డి తనకున్న 4 ఎకరాల వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ అనుబంధంగా ఇంటి వద్ద ఉన్న కొద్దిపాటి స్థలంలో కౌజు పిట్టలను పెంచుతున్నాడు. రూ.50 వేలు ఖర్చు చేసి షెడ్డు నిర్మించుకుని 800 కౌజు పిట్టలను పెంచుతున్నాడు. సాధారణ బాయిలర్‌ కోళ్లకు అందించే దానానే ఈ పిట్లలకు సైతం ఉపయోగిస్తున్నాడు. 40 రోజుల పెంపకం పూర్తి కాగానే జత పిట్టలను రూ.120కి విక్రయిస్తున్నాడు. ఒక్కో పిట్టను పెంచడానికి సుమారు రూ.30 ఖర్చు చేస్తున్నాడు. రెండు పిట్టలకు రూ.60 ఖర్చు పోగా రూ.60 లాభం పొందుతున్నాడు. 40 రోజుల్లో రూ.30 వేల నుంచి రూ.40 వేలు సంపాదిస్తున్నాడు.

స్వయంగా ఇంక్యూబేటర్ల తయారీ

కౌజు పిట్టలతోపాటు 100 నాటు కోళ్లను పెంచుతున్నాడు.. రైతు శ్రీనివాసరెడ్డి. కౌజు పిట్టల నుంచి సేకరించిన గుడ్లను ఇంక్యూబేటర్‌లో ఉంచి పిల్ల లను ఉత్పత్తి చేస్తున్నాడు. తనకు అవసరం ఉన్న పిల్లలను ఉంచుకుని మిగిలిన పిల్లలను ఒక్కో పి ల్లకు రూ.10 చొప్పున విక్రయిస్తూ లబ్ధిపొందుతున్నా డు. ఇందుకు గాను తానే స్వయంగా అతి తక్కువ ఖర్చుతో ఇంక్యూబేటర్‌ తయారు చేసుకున్నాడు. థర్మాకోల్‌ షీట్లు, రెండు విద్యుత్‌ బల్బులు, వేడిని కొలిచే యంత్రాలతో రూ.3 వేలు మాత్రమే ఖర్చు చేసి ఇంక్యూబేటర్‌ తయారు చేశాడు. ఇలా 8 ఇంక్యూబేటర్లు స్వయంగా తయారు చేసుకున్నాడు. కౌజు గుడ్లనుంచి రోజుకు 80 పిల్లలను ఉత్పిత్తి చేస్తున్నాడు. 18 రోజుల్లో గుడ్లనుంచి పిల్లలు ఉత్పత్తి అ వుతున్నాయి. ఇక నాటు కోడి గుడ్ల నుంచి 21 రోజు లకు పిల్లలు ఉత్పత్తి అవుతున్నాయి. నాటు కోడి పి ల్లలను ఒక్కోటి రూ.35 చిప్పున విక్రయించి అదన పు ఆదాయం గడిస్తున్నాడు. ఇలా వ్యవసాయానికి అనుబంధంగా శ్రీనివాసరెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి స రి సమానంగా నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు సంపాదిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

కుటీర పరిశ్రమలతో లాభాలు..

ప్రస్తుతం వ్యవసాయం లాభసాటిగా లేదు. అలా అని వ్యవసాయాన్ని వదిలే పరిస్థితి లేదు. కావున వ్యవసాయానికి అనుబంధంగా చిన్న తరహా కుటీర పరిశ్రమలతో లాభాలు పొందవచ్చు. నేను కౌజు పిట్టలు, నాటు కోళ్ల పెంపకాన్ని గత నాలుగేళ్లుగా కొనసాగిస్తున్నాను. వ్యవసాయంలో యాసంగిలో మాత్రమే మొక్కజొన్న వేస్తున్నాను. నెలకు రూ.40వేల నుంచి రూ.50 వేల వరకు ఆదాయం పొందుతున్నాను. యువత మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కౌజు పిట్టలు, నాటు కోళ్ల పెంపకంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలవైపు వస్తే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది.

– బీరం శ్రీనివాసరెడ్డి,

తిమ్మంపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement