కేయూ దూరవిద్య సీఎల్‌ఐఎస్‌సీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

కేయూ దూరవిద్య సీఎల్‌ఐఎస్‌సీ పరీక్షలు

Apr 4 2026 8:19 AM | Updated on Apr 4 2026 8:19 AM

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య సీడీఓఈ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మెషన్‌ సైన్స్‌ సీఎల్‌ఐఎస్‌సీ రెగ్యులర్‌ అండ్‌ ఎక్స్‌ అభ్యర్థులకు ఈనెల 15వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ పద్మజ తెలిపారు. ఈనెల 15, 17, 20, 22, 24 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరగుతాయని వారు తెలిపారు.

బీఎల్‌ఐఎస్‌సీ పరీక్షలు...

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య (సీడీఓఈ /ఎస్‌డీఎల్‌సీఈ) బీఎల్‌ఐఎస్‌సీ ఇయర్‌వైజ్‌ ఎక్స్‌ అభ్యర్థులకు ఈనెల 15వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ పద్మజ తెలిపారు. ఈనెల 15, 17, 20, 22, 24, 27, 29 తేదీల్లో పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

జనగామ టు నేపాల్‌

ద్విచక్రవాహనంపై 5,300 కిలో మీటర్లు

ప్రయాణించిన యువకుడు

జనగామ రూరల్‌: జనగామ పట్టణానికి చెందిన మోర్తాల దీపక్‌ జనగామ నుంచి నేపాల్‌ హిమాలయాల వరకు 5,300 కిలోమీటర్లు అంతర్జాతీయ బైక్‌ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. నేపాల్‌లోని అత్యంత ఎత్తయిన మార్గాలు 13,100 అడుగుల ఎత్తులో ఉన్న అప్పర్‌ ముస్తాంగ్‌, లోయర్‌ ముస్తాంగ్‌ వంటి హై అల్టిట్యూడ్‌ ప్రాంతాలను విజయవంతంగా చేరుకున్నాడు. ఇన్నర్‌ లైన్‌ బైక్‌ పర్మిట్‌ తీసుకుని ఈ ప్రత్యేక ప్రాంతాలను సందర్శించడంతోపాటు నేపాల్‌ రాజధాని ఖట్మాండ్‌ను సందర్శించాడు.

విద్యుదాఘాతంతో

మహిళ మృతి

నడికూడ: విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం వరికోల్‌ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సనుగోజు వనమాల(46) తనకున్న పిండిగిర్నిని స్టార్ట్‌ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై పడిపోయింది. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా, 108 సిబ్బంది పైలట్‌ రాము, ఈఎన్‌టీ స తీష్‌ ఘ టనా స్థలానికి చేరుకుని వనమాలను పరీక్షి ంచి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు.

తాడిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

బచ్చన్నపేట: ప్రమాదవశాత్తు తాడి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కట్కూర్‌ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోల సత్యనారాయణ (57) రోజూ మాదిరిగానే తాటి కల్లు తీసేందుకు వెళ్లాడు. రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి రాకపోవడం.. ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు తాడి చెట్లు వద్దకు వెళ్లి పరిశీలించగా.. తాడి చెట్టు కింద చనిపోయి పడి ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సత్యనారాయణకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement