● సంగాల పాల్సన్ రాజ్
ధర్మసాగర్: ప్రపంచ మానవాళి రక్షణకు యేసుక్రీస్తు సిలువలో ప్రాణత్యాగం చేశారని క్రీస్తుజ్యోతి మినిస్ట్రీస్ కరుణాపురం ఫౌండర్, ప్రవక్త, రెవ.సంగాల పాల్సన్ రాజ్ అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని క్రీస్తుజ్యోతి మందిరంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా సొసైటీ ఆఫ్ క్రైస్ట్ జనరల్ సెక్రటరీ రెవ.డాక్టర్ జయప్రకాశ్ గోపు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్సన్ రాజ్ మాట్లాడారు. యేసుక్రీస్తు సిలువ త్యాగం గొప్పదన్నారు. సిలువపై మరణించిన రోజు గంభీరమైన, నిరుపమానమైన ప్రేమకు నిదర్శనమని అన్నారు. సిలువలో యేసుక్రీస్తు పలికిన మొదటి మాటలో క్షమాపణ, రెండో మాట రక్షణ, మూడో మాట సంబంధం, నాల్గవ మాట వేదన, ఐదో మాట శరీర శ్రమ, ఆరవ మాట విజయం, ఏడో మాట సమర్పణ అని ఈ ఏడు మాటలు మానవాళి మార్గదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రదర్స్ పౌల్, ప్రదీప్, సందీప్, సత్యం, వినయ్, బెంజమిన్, యోసోఫ్ లు ఏడు మాటలపై వివరించారు. వేలాది భక్తులు పాల్గొన్నారు.


