కాంగ్రెస్‌తోనే ఘన్‌పూర్‌ అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే ఘన్‌పూర్‌ అభివృద్ధి

Feb 7 2026 2:01 PM | Updated on Feb 7 2026 2:01 PM

కాంగ్రెస్‌తోనే ఘన్‌పూర్‌ అభివృద్ధి

కాంగ్రెస్‌తోనే ఘన్‌పూర్‌ అభివృద్ధి

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్‌ఘన్‌పూర్‌: స్టేషన్‌ఘన్‌పూర్‌ అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 1, 12, 13వ వార్డుల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్యే శ్రీహరి శుక్రవారం ప్రచారం చేపట్టారు. ఆయా వార్డుల్లో ఇంటింటా తిరుగుతూ చేతిగుర్తుకు ఓటు వేయాలని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వార్డుకు రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తానన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు. దళితబంధు కోసం బంధువుల వద్దనే డబ్బులు తీసుకున్న నీచచరిత్ర మాజీ ఎమ్మెల్యే రాజయ్యది అని ఆరోపించారు. ఎస్సీ కాలనీకి రెండో విడతలో 100 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు, మున్సిపాలిటీకి మరో రూ.50 కోట్లు, శ్మశానవాటిక కోసం మూడు ఎకరాల భూమి అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు బంధువైన తాటికొండ దేవయ్యతోపాటు తాటికొండ నవీన్‌, తాటికొండ కుమార్‌, మాతంగి అశోక్‌, మాతంగి దేవయ్య ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. 12వ వార్డు బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి జ్యోతికుమార్‌ పోటీ నుంచి తప్పుకుని కడియం సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో నరేందర్‌రెడ్డి, అభ్యర్థులు సింగపురం దయాకర్‌, తాటికొండ వినయ్‌కుమార్‌, గట్టు సంగీతరమేష్‌, నాయకులు ఎల్లయ్య, సతీష్‌, వెంకటయ్య, రమేష్‌, యాదగిరి, రాజయ్య, జగదీష్‌, రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement