మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల వేతనాలు
వరంగల్ డెస్క్: తెలంగాణ మున్సిపల్ చట్టం, 2019లోని సెక్షన్ 41 ప్రకారం.. చైర్మన్, వైస్–చైర్మన్, వార్డు సభ్యులకు నిర్ణీత గౌరవ వేతనం, ఇతర అలవెన్సులు పొందే హక్కు ఉంటుంది. వీటిని సంబంధిత మున్సిపాలిటీల సాధారణ నిధులనుంచి చెల్లిస్తారు. వీటిని మూడు కేటగిరీలుగా విభజించారు. కార్పొరేషన్లకు(జీహెచ్‌ఎంసీతో కలిపి) మేయర్ రూ.65,000, డిప్యూటీ మేయర్‌కు రూ.32,500, కౌన్సిలర్‌కు రూ.7,800 వేతనం ఉంటుంది. కేటగిరీ – 2లో 50వేలకుపైగా జనాభా గల మున్సిపాలిటీలు ఉంటాయి. ఇక్కడ చైర్మన్‌కు రూ.19,500, వైస్–చైర్మన్‌కు రూ.9,750, కౌన్సిలర్ రూ.4,550 ఉంటుంది. ఇక 50వేలలోపు జనాభా కలిగిన మున్సిపాలిటీలను మూడో కేటగిరీలో చేర్చారు. ఈ కేటగిరీలోని చైర్మన్‌కు రూ.15,600, వైస్ చైర్మన్‌కు రూ.6,500, కౌన్సిలర్‌కు రూ.3,250 వేతనం ఉంటుంది. ఈ మొత్తంలో గౌరవ వేతనంతోపాటు కన్వేయన్స్ అలవెన్స్ (రవాణా ఖర్చులు) కూడా ఉంటాయి.


