ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
డోర్నకల్: మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఆదేశించారు. స్థానిక నిర్మలా హైస్కూల్‌లో మున్సిపల్ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రం, స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రిసెప్షన్‌తో పాటు కౌంటింగ్ కేంద్రాల్లో అభ్యర్థులు, సిబ్బంది కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు శ్యాంప్రసాద్‌లాల్, ఆర్‌డీఓ కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ నిరంజన్, తహసీల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసనాయక్, సీఐ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.


