ఎస్పీని కలిసిన హెడ్‌ కానిస్టేబుళ్లు | - | Sakshi
Sakshi News home page

ఎస్పీని కలిసిన హెడ్‌ కానిస్టేబుళ్లు

Feb 7 2026 2:04 PM | Updated on Feb 7 2026 2:04 PM

ఎస్పీ

ఎస్పీని కలిసిన హెడ్‌ కానిస్టేబుళ్లు

మహబూబాబాద్‌ రూరల్‌: ఇటీవల పదోన్నతి పొందిన ముగ్గురు హెడ్‌ కానిస్టేబుళ్లు ఎస్పీ శబరీష్‌ను జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సీ.హెచ్‌.శ్రీనివాసరావు, పి.రాంబాబు, డీ.వెంకటేశ్వర్లు కానిస్టేబుళ్ల నుంచి హెడ్‌ కానిస్టేబుళ్లుగా ప దోన్నతి పొందారు. కాగా వారికి ఎస్పీ శబరీష్‌ శుభాకాంక్షలు తెలియజేసి, పోలీసు శాఖలో బాధ్యతలు మరింత నిబద్ధతతో, ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్వర్తించాలని సూచించారు. క్రమశిక్షణ, సేవాభావం, ప్రజల పట్ల స్నేహపూర్వక దృక్పథం కలిగి విధులు నిర్వర్తించాలని దిశానిర్దేశం చేశారు.

సహాయక కేంద్రం ఏర్పాటు

మహబూబాబాద్‌: మానుకోట మున్సిపల్‌ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు జీడీసీలో పోస్టల్‌ బ్యాలెట్‌ సహాయక కేంద్రం ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్‌ డిస్ట్రిక్ట్‌ ఎలక్షన్‌ అథారిటీ, మానుకోట మున్సిపల్‌ కమిషనర్‌ రాజేశ్వర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులు ఈనెల 7,8వ తేదీల్లో ఓటరు సహాయక కేంద్రంలో ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

ముగిసిన తిరుగువారం జాతర

గంగారం: మండలంలోని పూనుగొండ్లలో పగిడిద్దరాజు తిరుగువారం జాతర శుక్రవారం ముగి సింది. ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలు, డో లు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో మూ డుోజుల పాటు జాతర నిర్వహించారు. భక్తుల మొక్కుల అనంతరం పగిడిద్దరాజు ప్రతిమలను దేవుని గుట్టకు చేర్చడంతో జాతర ముగిసింది. ప్రధాన పూజారులు పెనక రాజేశ్వర్‌, సురేందర్‌, పురుషోత్తం, సమ్మయ్య, రాహుల్‌ పాల్గొన్నారు.

విద్యార్థుల క్షేత్ర సందర్శన

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ మండలంలోని కంబాలపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం, జేవీఆర్‌ ఉద్యాన పరిశోధన స్థానాన్ని శుక్రవారం సందర్శించారు. విద్యార్థులకు జేవీఆర్‌ ఉద్యాన పరిశోధన స్థానం సైంటిస్ట్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిరప, పసుపు పంటలపై అవగాహన కల్పించారు. 25 రకాల మామిడి, జామ మొక్కల్లో అంటుకట్టడం విధానాన్ని వివరించారు. ప్రధానోపాధ్యాయులు కె.గిరిజ, ఉపాధ్యాయులు శ్రీధర్‌ రెడ్డి, సోమేశ్వర్‌, వెంకటేశ్వర్లు, దీపిక, రమాదేవి, వినోద్‌ పాల్గొన్నారు.

ఖేలో ఇండియా జిల్లాస్థాయి క్రీడలు

మహబూబాబాద్‌ అర్బన్‌: ఖేలో ఇండియా అథ్లెటిక్స్‌, కబడ్డీ, బాక్సింగ్‌ అండర్‌–14, 16బాలికల జిల్లాస్థాయి క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు తమ పేర్లను ఆన్‌లైన్‌లో నేషనల్‌ స్పోర్ట్స్‌ రేపోసిటరీ సిస్టమ్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఓలేటి జ్యోతి శుక్రవారం తెలిపారు. పూర్తి వివరాలకు 94406 30681 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలన్నారు.

సీఓఈ కళాశాలల్లో

ప్రవేశానికి రేపే గడువు

న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థలు(టెమ్రిస్‌) ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన సీఓఈ (సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌) ఇంటర్‌ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 8వరకు గడువు ఉందని ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి జంగా సతీశ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బాలికలకు (హనుమకొండ కేయూ క్రాస్‌ రోడ్డులోని టెమ్రిస్‌ వరంగల్‌–1 బాలికలు), బాలు రకు హనుమకొండ హంటర్‌ రోడ్డులోని కాజీపేట బాలుర కళాశాలలో ఏర్పా టు చేసినట్లు తెలి పారు. అలాగే, జేఈఈ, నీట్‌, ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. పూర్తి వివరాలకు ఆయా కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు.

ఎస్పీని కలిసిన హెడ్‌ కానిస్టేబుళ్లు1
1/2

ఎస్పీని కలిసిన హెడ్‌ కానిస్టేబుళ్లు

ఎస్పీని కలిసిన హెడ్‌ కానిస్టేబుళ్లు2
2/2

ఎస్పీని కలిసిన హెడ్‌ కానిస్టేబుళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement