అగ్రనేతలకు సవాలే! | - | Sakshi
Sakshi News home page

అగ్రనేతలకు సవాలే!

Feb 7 2026 2:04 PM | Updated on Feb 7 2026 2:04 PM

అగ్రనేతలకు సవాలే!

అగ్రనేతలకు సవాలే!

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 11న పోలింగ్‌ జరగనుండగా.. రెండు రోజుల ముందే ప్రచారానికి తెరపడనుంది. అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి ఇంకా మూడు రోజులే మిగిలింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు అభ్యర్థుల గెలుపు కోసం దూకుడు పెంచారు. ప్రజాప్రతి నిధులు, పార్టీలు నియమించిన ఎన్నికల ఇన్‌చార్జ్‌ లు రెండు రోజులుగా మున్సిపాలిటీల్లోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటి ప్రచారం, కులసంఘాలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌లో ఈ ఎన్నికలు మూడు పార్టీల నేతలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను సవరించుకుంటూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

10నియోజకవర్గాలు.. 12 మున్సిపాలిటీలు..

ఉమ్మడి వరంగల్‌లో 12 మున్సిపాలిటీలలో 260 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిసి 1,073 మంది పోటీలో ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌.. 12 మున్సిపాలిటీలను కై వసం చేసుకోవడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్‌ తర్వాత ఎక్కు వ పంచాయతీలలో తమ మద్దతుదారులను గెలిపి ంచుకుని రెండో స్థానంలో నిలిచిన బీఆర్‌ఎస్‌.. గత వైభవాన్ని చాటుతామంటోంది. బీజేపీ 12 మున్సిపాలిటీల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. కాగా వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గాలు మినహా 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

ఆయా నేతలకు ఈ ఎన్నికలు సవాలే..

● హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకా శ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ తరఫున కాళిప్రసాదరావు ప్రచారం చేస్తున్నారు.

● వరంగల్‌ జిల్లాలో నర్సంపేట, వర్ధ్దన్నపేట ము న్సిపాలిటీలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు సవాల్‌గా మారాయి. నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి చైర్మన్‌ పీఠం కోసం కుస్తీ పడుతున్నారు. వర్ధన్నపేటలో ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమే్‌శ్‌ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం వార్డుల్లో తిరుగుతున్నారు.

● జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీ పీఠం కోసం బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభ్యర్థుల గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నేతలను కలుపుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఆమె అత్త, టీపీసీసీ నేత హనుమాండ్ల ఝాన్సీ అభ్యర్థులను బరిలోకి దింపారు. వరంగల్‌ ఎంపీ డా.కడియం కావ్య ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

● జనగామ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు నువ్వా, నేనా అన్న రీతిలో ఉన్నాయి. ఇక్కడ బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నా రు. కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఉండగా, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, పాయం వెంకటేశ్వర్లులు ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు.

● స్టేషన్‌ ఘన్‌పూర్‌ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కాగా.. ఇక్కడ కాంగ్రెస్‌తో కలిసి నడుస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత తాటికొండ రాజయ్య పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నారు.

● భూపాలపల్లి మున్సిపాలిటీలో పాగా వేసేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (కాంగ్రెస్‌), గండ్ర వెంకట రమణారెడ్డి (బీఆర్‌ఎస్‌)వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మెజార్టీ స్థానాలను దక్కించుకుని చైర్మన్‌ పీఠంను కై వసం చేసుకోవాలని చూస్తున్నారు. బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి అభ్యర్థులను బరిలోకి దింపారు.

● ములుగు నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ధనసరి సీతక్క కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీపై కాంగ్రెస్‌ జెండాను ఎగురవేయాలని భావిస్తున్నారు. ముఖ్యనేతలు, పార్టీ ఇన్‌చార్జ్‌లతో కలిసి అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న బడే నాగజ్యోతి.. ఆమెకు తోడుగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

● మహబూబాబాద్‌ జిల్లా మహబూబాబాద్‌, డోర్నకల్‌ నియోజకవర్గాల్లో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబాబాద్‌, కేసముద్రం మున్సిపాలిటీల ఎన్నికలు ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ (కాంగ్రెస్‌), మాజీ ఎమ్మెల్యే బి.శంకర్‌నాయక్‌(బీఆర్‌ఎస్‌)లకు ప్రతిష్టాత్మకం కాగా, బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, కాంగ్రెస్‌ నుంచి సీహెచ్‌ వెంకటేశ్‌లు ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు. బీజేపీ నుంచి హుస్సేన్‌నాయక్‌.. అభ్యర్థులను బరిలోకి దింపారు.

● డోర్నకల్‌ నియోజకవర్గంలో డోర్నకల్‌, మరిపెడ మున్సిపాలిటీల ఎన్నికలు ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రు నాయక్‌ (కాంగ్రెస్‌), మాజీ ఎమ్మె ల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ (బీఆర్‌ఎస్‌)లకు సవాల్‌గా మారాయి.

పుర పోరు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకం

మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకూ కత్తి మీద సామే

గ్రామ పంచాయతీ ఫలితాల బేరీజు..

పకడ్బందీగా గెలుపు కోసం పావులు

రెండు రోజులుగా మున్సిపాలిటీల్లోనే నేతల మకాం

ఓట్ల కోసం పార్టీల నేతలు, ఇన్‌చార్జ్‌ల పాట్లు.. రోజువారీ పరిస్థితిపై అధిష్టానాల ఆరా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement