అత్యధిక మెజార్టీతో గెలుపు | - | Sakshi
Sakshi News home page

అత్యధిక మెజార్టీతో గెలుపు

Feb 14 2026 7:22 AM | Updated on Feb 14 2026 7:22 AM

అత్యధిక మెజార్టీతో గెలుపు

అత్యధిక మెజార్టీతో గెలుపు

మహబూబాబాద్‌: మానుకోట మున్సిపాలిటీలోని 35వ వార్డులో అత్యధిక మెజార్టీతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గద్దె నీరజారాణి గెలుపొందినట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చలమల నిర్మలపై 1153 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు తెలిపారు.

క్యాంపునకు తరలిన

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు

తొర్రూరు: తొర్రూరు మున్సిపల్‌ ఎన్నికల్లో గెలు పొందిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు క్యాంపునకు తరలివెళ్లారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తొమ్మిది స్థానాల్లో గెలుపొంది మున్సిపాలిటీని కై వసం చేసుకుంది. అధికార కాంగ్రెస్‌ పార్టీ ఏడు స్థానాల్లో గెలిచింది. దీంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు గాలం వేయకుండా మాజీ మంత్రి దయాకర్‌రావు నాయకత్వంలో వారిని క్యాంపునకు తరలించారు. మెజార్టీ స్థానాలు బీఆర్‌ఎస్‌ గెలుపొందిన తరుణంలో వారిని రక్షించుకునేందుకు పార్టీ చర్యలు తీసుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం డివిజన్‌ కేంద్రంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ర్యాలీ చేపట్టి, టపాసులు కాల్చి సంబురాలు నిర్వహించారు. బస్సులో కౌంటింగ్‌ కేంద్రానికి వచ్చి ఎన్నికల అధికారి నుంచి ధ్రువపత్రాలు అందుకున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అదే బస్సులో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. మాజీ మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందనడానికి బీఆర్‌ఎస్‌కు వచ్చిన అనుకూల ఫలితాలే నిదర్శనమన్నారు. తొర్రూరు పట్టణంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులను గమనించి ప్రజలు తీర్పునిచ్చారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

డోర్నకల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు..

డోర్నకల్‌: డోర్నకల్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించిన 11 మంది అభ్యర్థులు క్యాంపునకు తరలివెళ్లారు. శుక్రవారం కాంగ్రెస్‌ నాయకులు తాళ్లూరి హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన క్యాంపునకు తరలివెళ్లారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఇలా..

మహబూబాబాద్‌ అర్బన్‌: మానుకోట మున్సిపాలిటీ ఎన్నికల్లో వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. 1వ వార్డులో కాంగ్రెస్‌కు ఒక ఓటు వచ్చింది. 11వ వార్డులో బీఆర్‌ఎస్‌కు ఒక ఓటు, కాంగ్రెస్‌కు ఒక ఓటు, 12వ వార్డులో కాంగ్రెస్‌కు మూడు, 21వ వార్డులో బీఆర్‌ఎస్‌కు రెండు, కాంగ్రెస్‌ ఒక ఓటు పడింది. 24వ వార్డులో కాంగ్రెస్‌కు రెండు, 9వ వార్డులో బీఆర్‌ఎస్‌కు ఒకటి, 17వ వార్డులో కాంగ్రెస్‌కు ఒకటి, 31వ వార్డులో జనసేనకు ఒకటి, కాంగ్రెస్‌కు ఒకటి, 31వ వార్డులో బీజేపీకి ఒకటి, కాంగ్రెస్‌కు రెండు, 10వ వార్డులో బీఆర్‌ఎస్‌కు రెండు ఓట్లు పోలయ్యాయి. అలాగే 13వ వార్డులో కాంగ్రెస్‌కు రెండు, స్వతంత్ర అభ్యర్థులకు మూడు, 14వ వార్డులో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు తలా ఒకటి, 18వ వార్డులో కాంగ్రెస్‌కు రెండు, సీసీఐకి ఒకటి, 27వ వార్డులో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు తలా ఒకటి, 28వ వార్డులో బీఆర్‌ఎస్‌కు రెండు, 30వ వార్డులో సీపీఎంకు ఒకటి, 25వ వార్డులో కాంగ్రెస్‌కు ఒక ఓటు పోలైంది. 29వ వార్డులో సీసీఎంకు ఒకటి, 33వ వార్డులో బీఆర్‌ఎస్‌కు ఒకటి, 35వ వార్డులో బీఆర్‌ఎస్‌కు ఒకటి, 36వ వార్డులో సీసీఐకి ఒకటి, కాంగ్రెస్‌కు ఒకటి, బీఆర్‌ఎస్‌కు రెండు పోస్టల్‌ ఓట్లు పడ్డాయి.

చైర్‌పర్సన్‌ రేస్‌లో..

మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ ఎన్నికల్లో విసారపు ప్రగతి రెండోసారి వార్డు సభ్యురాలిగా గెలు పొందారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున 9వ వార్డు నుంచి విజయం సాధించి ప్రజలకు సేవ చేసి వారి మన్ననలు పొందారు. కాగా, ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ తరఫున 8వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొంది.. చైర్‌పర్సన్‌ రేసులో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement