ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి.. | - | Sakshi
Sakshi News home page

ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి..

Feb 10 2026 7:58 AM | Updated on Feb 10 2026 7:58 AM

ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి..

ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి..

హన్మకొండ: ఆర్టిజన్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఏ క్షణమైనా సమ్మెకు సిద్ధమని, విద్యుత్‌ వ్యవస్థను స్తంభింపజేస్తామని తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ సతీశ్‌ రెడ్డి, కన్వీనర్లు సాయిలు, సింగిరెడ్డి చంద్రారెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్‌లోని పల్లా రవీందర్‌ రెడ్డి భవన్‌లో జేఏసీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు ఆర్టిజన్‌ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్టిజన్ల పట్ల యాజమాన్యాలు సవతి తల్లి ప్రేమ చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా సర్వీస్‌ రూల్స్‌, ఇతర సౌకర్యాలు వర్తింపజేయాలన్నారు. అనంతరం టీజీ ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌ రెడ్డికి వినతి పత్రం అందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమావేశంలో జేఏసీ కో చైర్మన్‌ శ్రీధర్‌గౌడ్‌, కోశాధికారి ప్రశాంత్‌, ట్రాన్స్‌కో కన్వీనర్‌లు కందికొండ వెంకటేష్‌, పొగాకు భరత్‌, ఎన్పీడీసీఎల్‌ కంపెనీ చైర్మన్‌ సికిందర్‌, నాయకులు వెంకన్న, పాపిరెడ్డి, జయచందర్‌, రాజన్న, ఐలయ్య, సృజన, శ్రీకాంత్‌, రాజేశ్‌ నాయక్‌, శ్రీనివాస్‌, కోటి, నరేశ్‌, సంజీవ, రాజేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

లేనిపక్షంలో ఏ క్షణమైనా సమ్మెకు సిద్ధం

తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ సతీశ్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement