‘హరిత’ సేవలు సమర్థవంతంగా నిర్వహించాలి
హన్మకొండ: హరిత కాకతీయ హోటల్ సేవలు మరింత సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ కత్తి నాథన్ అన్నారు. శుక్రవారం రాత్రి హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో మేడా రం విజయోత్సవ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ హరిత కాకతీ య హోటల్ సిబ్బంది అందించిన సేవలను మంత్రులు, జి ల్లా కలెక్టర్, అధికారులు ప్రశంసించారని తెలిపారు. అతి థులకు సౌకర్యాలు, భోజనం అందించే విషయంలో విజయవంతమైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ కత్తి నాథన్‌ను జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ శాలువా కప్పి సన్మానించారు. సమావేశంలో టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసు మ సూర్య కిరణ్, హరిత కాకతీయ హోటల్ హనుకమకొండ మేనేజర్ అశోక్, ఏఈ విజయ్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జంగయ్య, చైత న్య, సాంబ శివరెడ్డి, హెడ్ కుక్ శ్యామ్ పాల్గొన్నారు.
రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ
జనరల్ మేనేజర్ కత్తి నాథన్


