చిన్నారుల సమాచారం ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

చిన్నారుల సమాచారం ఇవ్వండి

Feb 13 2026 3:55 AM | Updated on Feb 13 2026 3:55 AM

చిన్న

చిన్నారుల సమాచారం ఇవ్వండి

ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలి

వరంగల్‌ క్రైం: కాజీపేట పోలీస్‌, రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో చిన్నారులను అపహరించిన ముఠాను టాస్క్‌ఫోర్స్‌, కాజీపేట పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో నిందితులను విచారించగా మరో ముగ్గురు చిన్నారులు వివిధ ప్రాంతాల్లో అపహరణకు గురై ప్రస్తుతం శిశు సంక్షేమశాఖ సంరక్షణలో ఉన్నారని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. వారి తల్లిదండ్రులు సరైన ఆధారాలతో పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో చిన్నారుల్లో ఒకరైన ఆరేళ్ల వయస్సు గల బాబును 2023 అక్టోబర్‌లో కాజీపేట రైల్వే ప్లాట్‌ ఫాం నుంచి అపహరించగా, ఏడు నెలల పాపను గతేడాది మంచిర్యాల రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతంలో, ఇంకో ఐదు మాసాల పాపను రామగుండం రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతంలో అపహరించినట్లు వివరించారు. పిల్లలకు సంబంధించి సరైన ఆధారాలను పట్టుకొని కాజీపేట ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌రెడ్డి సెల్‌ నంబర్‌ 87126 85122లో సంప్రదించి పిల్లలను తీసుకువెళ్లాలని సూచించారు.

హన్మకొండ: విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని విద్యుత్‌ ఉద్యోగ సంఘాల నాయకులు డి మాండ్‌ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా.. తెలంగాణ పవ ర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈసందర్భంగా టీఎస్‌ఈఈయూ–327 ఎన్పీడీసీఎల్‌ కంపెనీ అధ్యక్షుడు పి.మహేందర్‌ రెడ్డి, తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల సంఘం–1104 కార్యదర్శి రమణ, తెలంగాణ పవర్‌ డిప్లొమా ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఇంద్రసేనారెడ్డి, విద్యుత్‌ ఎస్టీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఎన్పీడీసీఎల్‌ సెక్రటరీ అజ్మీరాశ్రీరాం నాయక్‌, బీసీ విద్యుత్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్పీడీసీఎల్‌ కంపెనీ సెక్రటరీ నీలారపు రాజేందర్‌ మా ట్లాడుతూ విద్యుత్‌ సంస్థలను ప్రయివేటీకరించడం వల్ల వినియోగదారులపై భారం పెరుగుతుందన్నారు. ఉద్యోగావకాశాలు పోతాయన్నారు. కేంద్రం ఈ అంశంపై వెనక్కి తగ్గకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నా రు. ఎన్పీడీసీఎల్‌ చీఫ్‌ ఇంజనీర్లు రాజు చౌహాన్‌, సదర్‌లాల్‌, ఆయా సంఘాల నాయకులు సామ్యానాయక్‌, సుబ్రహ్మణ్యేశ్వర్‌రావు, మల్లి కార్జున్‌, సదానందం, ఓదెలు, బుచ్చయ్య గౌడ్‌, జశ్వంత్‌ కుమార్‌, పాల్గొన్నారు.

చిన్నారుల సమాచారం ఇవ్వండి1
1/2

చిన్నారుల సమాచారం ఇవ్వండి

చిన్నారుల సమాచారం ఇవ్వండి2
2/2

చిన్నారుల సమాచారం ఇవ్వండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement