సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
విద్యారణ్యపురి: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం అన్నారు. గురువారం హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘సెక్యూరిటింగ్ ది డిజి టల్ ఫ్యూచర్ సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా ప్రైవసీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. డిజిటల్ యుగంలో ఉన్నత విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సైబర్ ముప్పు, సమాచార భద్రత, నైతిక బాధ్యతల గురించి వివరించారు. కేయూ కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి బి.రమ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలిపారు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి, సదస్సు కన్వీనర్ డి.సురేశ్‌బాబు, వైస్ ప్రిన్సిపాల్ జి.సుహాసిని, అకడమిక్ కో–ఆర్డినేటర్ ఎం.అరుణ, తదితరులు పాల్గొన్నారు. కాగా, జాతీయ సదస్సు సావనీర్‌ను రిజిస్ట్రార్ రామచంద్రం ఇతర అతిథులు ఆవిష్కరించారు. పలువురు పరిశోధన పత్రాలు సమర్పించారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి


