గులాబీ జెండా ఎగురవేయాలి | - | Sakshi
Sakshi News home page

గులాబీ జెండా ఎగురవేయాలి

Feb 10 2026 7:55 AM | Updated on Feb 10 2026 7:55 AM

గులాబ

గులాబీ జెండా ఎగురవేయాలి

రెండేళ్లలో వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే

మానుకోట మున్సిపల్‌ ఎన్నికల

కార్నర్‌ మీటింగ్‌లో కేటీఆర్‌

మహబూబాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని నర్సంపేట రోడ్డు జింకల జంక్షన్‌ నుంచి వివేకానంద సెంటర్‌ మీదుగా మదర్‌థెరిసా సెంటర్‌ వరకు కేటీఆర్‌ రోడ్‌ షో నిర్వహించారు. అనంతరం కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. మానుకోటకు వస్తే తెలియని ఉత్సాహం వస్తుందని, లగచర్ల ఘటన సమయంలో ఇక్కడి నుంచే గర్జించడం జరిగిందన్నారు. రేవంత్‌రెడ్డి అమలు కాని హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చారన్నారు. రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్‌ విషయంలో రైతులకు అన్యాయం చేశారన్నారు. మానుకోట జిల్లా చేసేది కాదని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని, జిల్లా కావాలా వద్దా అన్నారు. జిల్లాల ఏర్పాటుతోనే కలెక్టర్‌ కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాల ఏర్పాటు జరిగి పాలన సులభతరమైందన్నారు. జి ల్లాలోని చిన్నగూడూరు ప్రాంతానికి చెందిన దాశరథిని సీఎం రేవంత్‌ రెడ్డి నిజామాబాద్‌ జిల్లా అని మాట్లాడుతున్నారంటే ఆయనకు చరిత్ర తెలియదని ఎద్దేవా చేశారు. మూడు ఫీట్ల మనిషి సీఎం రేవంత్‌రెడ్డిని నమ్మి మోసపోవద్దన్నారు. రెండేళ్లలో బీ ఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుందని, మరోసారి కేసీఆర్‌ సీఎం అవుతారని అన్నా రు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకొని మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. గెలిచిన తర్వాత మానుకోటకు మళ్లీ వస్తానన్నారు. కాగా, కేటీఆర్‌ రోడ్‌ షో కార్యకర్తలు, నాయకుల్లో జోష్‌ నింపింది. కేసీఆర్‌ పాటకు కేటీఆర్‌, నాయకులు, కార్యకర్తలు పార్టీ కండువాలు ఊపుతూ నృత్యం చేశారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్‌, వినయ్‌భాస్కర్‌, నరేందర్‌, నాయకులు రామ్మోహన్‌రెడ్డి, ఫరీద్‌, మురళీధర్‌రెడ్డి, కెఎస్‌ఎన్‌రెడ్డి, నరేష్‌ పాల్గొన్నారు.

గులాబీ జెండా ఎగురవేయాలి1
1/2

గులాబీ జెండా ఎగురవేయాలి

గులాబీ జెండా ఎగురవేయాలి2
2/2

గులాబీ జెండా ఎగురవేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement