ప్రతీ విద్యార్థిపై ప్రత్యేకశ్రద్ధ వహించాలి
● డీఈఓ రాజేశ్వర్
తొర్రూరు: తరగతిలోని ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్తమ ఫలితాలను సాధించాలని డీఈఓ రాజేశ్వర్ అన్నారు. డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను శని వారం డీఈఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, మధ్యాహ్న భోజనం పరిశీలించి సూచనలు చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చొరవ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. పది ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేలా కృషి చేయాలన్నారు. ఉత్తీర్ణత శాతం పెంచేలా కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు జెల్ల లక్ష్మీనారాయణ, శారదాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


