అండర్‌–19 క్రికెట్‌ పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అండర్‌–19 క్రికెట్‌ పోటీలు ప్రారంభం

Feb 10 2026 7:58 AM | Updated on Feb 10 2026 7:58 AM

అండర్‌–19 క్రికెట్‌ పోటీలు ప్రారంభం

అండర్‌–19 క్రికెట్‌ పోటీలు ప్రారంభం

వరంగల్‌ స్పోర్ట్స్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వరంగల్‌ వేదికగా నిర్వహిస్తున్న తెలంగాణ అంతర్‌ జిల్లాల అండర్‌–19 క్రికెట్‌ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వంగాలపల్లిలోని డబ్ల్యూడీసీ క్రీడా మైదానంలో జరిగిన తొలిమ్యాచ్‌లో వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లా జట్లు తలపడ్డాయి. హనుమకొండకు చెందిన రంజీ క్రీడాకారుడు తోట సుఖాంత్‌ ముఖ్య అతిథిగా హాజరై టాస్‌ వేసి పోటీలు ప్రారంభించారు. మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న నిజామాబాద్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు గాను కేవలం 30.1 ఓవర్లు ఎదుర్కొని 117 పరుగుల చేసి అన్ని వికెట్లు కోల్పోయింది. అనంతరం బరిలోకి దిగిన వరంగల్‌ జట్టు కేవలం 24.1 ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొగిలి చ ర్ల మైదానంలో జరిగిన మరోమ్యాచ్‌లో కరీంనగర్‌ , ఆదిలాబాద్‌ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న కరీంనగర్‌ జట్టు 45 ఓవర్లలో 4వికెట్లను కోల్పోయి 231 పరుగులు సాధించింది. అనంతరం బరిలోకి దిగిన ఆదిలాబాద్‌ 34 ఓవర్లు ఎదుర్కొని 174 పరుగుల వద్ద అన్ని వికెట్లను కోల్పోయింది. దీంతో 158 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ నెల 14వ తేదీ వరకు లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్దతిలో పోటీలు కొనసాగుతాయని వరంగల్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రికెట్‌ అసోసియేషన్‌ జిల్లా మాజీ కార్యదర్శి మార్నేని ఉదయభానురావు, సభ్యులు బండారి ప్రభాకర్‌, మట్టెడ కుమార్‌, నిజామాబాద్‌ సంఘం జాయింట్‌ సెక్రటరీ సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

తొలిమ్యాచ్‌లో వరంగల్‌ శుభారంభం

నిజామాబాద్‌పై గెలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement