3.300 కిలోల గంజాయి పట్టివేత
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీ సమీపంలో రూ.1.70 లక్షల విలువైన 3.300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ సీఐ మహేందర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లాలోని బయ్యారం మండలానికి చెందిన యువకుడు అరవింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరకు నుంచి గంజాయిని తీసుకొచ్చి మహబూబాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీ వద్ద గంజాయి విక్రయించేందుకు అరవింద్ వచ్చాడని తెలిపారు. ఈక్రమంలో నందమూరి నగర్ కాలనీకి చెందిన జమనగుంట్ల భువనచంద్ర అలియాస్ బాబు, ఇందిరా కాలనీకి చెందిన ఐలబోయిన నరేష్, హనుమాన్ దేవాలయం సమీప నివాసి, బాబా గుట్టకు చెందిన బోడ వంశీను పట్టుకుని కేసు నమోదు చేశామన్నారు. గంజాయి విక్రయిదారుడు అరవింద్ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. టౌన్ ఎస్సై షాకీర్ సంఘటన స్థలంలో విచారణ చేపట్టి రెవెన్యూ సిబ్బంది సమక్షంలో గంజాయికి పంచనామా నిర్వహించారన్నారు. పీసీలు నాగరాజు, రఘురాం, గణపతి పాల్గొన్నారు.


